BREAKING NEWS : ప్రముఖ టాప్ సింగర్ మృతి ఆందోళనలో సినీ పరిశ్రమ

288

పాకిస్తాన్‌లో మహిళా ఆర్టిస్టులపై దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మరో నటి-సింగర్‌ భర్త చేతిలో దారుణహత్యకు గురయ్యారు. ఈ దారుణం పాక్‌లోని ఖైబర్‌ ఫంక్తుఖ్వాలో చోటుచేసుకుంది.నటి రేష్మ పలు సినిమాల్లో నటించారు.

గాయనిగానూ ఆమెకు మంచి పేరుంది. భర్తతో విభేదాలు ఉండటంతో రేష్మ గత కొన్నిరోజులుగా నౌషెరా కలాన్‌ లోని హకిమాబాద్‌లోని తన సోదరుడి ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ప్లాన్‌ ప్రకారం అక్కడికి వచ్చిన రేష్మ భర్త ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. తూటాలకు ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోగా, నిందితుడు అక్కడినుండి పరారయ్యాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అనంతరం నటి రేష్మ తీవ్ర రక్తస్రావంతో మృతిచెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తకు రేష్మ నాలుగో భార్య కాగా, వీరి మధ్య మనస్పర్థలున్నాయని పోలీసులు తెలిపారు.కాగా, రేష్మ హత్య ఈ ఏడాది మహిళా ఆర్టిస్టులపై జరిగిన 15వ ఉదంతం(దాడి) కావడం గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరి 3న ఆర్టిస్ట్‌ సంబల్‌ ఓ ప్రైవేట్‌ పార్టీలో హత్యకు గురైన విషయం విదితమే.