Breaking News : టాప్ గాయని హత్య…. చంపేసి పొలాల మధ్యలో ఎలా పడేశారో చూస్తే కన్నీళ్లే..

272

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు.ఆ తర్వాత హీరొయిన్ సంఘమిత్ర రాయ్ ఛటర్జీ కన్నుమూశారు. వీరి మరణ వార్తలను మరవకముందే మరొక సినీ సెలెబ్రిటీ చనిపోయారు.

Image result for మమతా శర్మను

కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన హర్యానా గాయని మమతా శర్మను ఎవరో హత్య చేశారు. రోహ్ తక్ జిల్లాలోని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్వగ్రామం బనియానీ సమీపంలో ఆమె మృతదేహమై కనిపించడం తీవ్ర కలకలాన్ని రేపింది. గడచిన ఆదివారం నాడు తన స్నేహితుడు మోహిత్ కుమార్ తో ఓ పాట కచేరిలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమె ఆపై ఇంటికి రాలేదు. ఆమె మృతదేహం గ్రామ సమీపంలోని పొలాల్లో నిన్న మధ్యాహ్నం కనిపించింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.కాగా ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో మోహిత్ తో కలసి సోనిపట్ జిల్లాలోని గోహనా పట్టణంలో ప్రదర్శనకు ఆమె వెళ్లగా ఆపై 10.30 గంటల సమయంలో మోహిత్, మమత కుటుంబీకులకు కాల్ చేసి ఆమె మరి కొందరితో కలసి ఇంకో కారులో వెళ్లిందని చెప్పాడు. వారు తనకు తెలుసునని, ఈవెంట్ వద్ద కలుస్తానని ఆమె చెప్పిందని, కానీ ఆమె అక్కడికి రాలేదని సమాచారం ఇచ్చాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

వెంటనే ఆమె సెల్ ఫోన్ కు రింగ్ ఇస్తే, ఫోన్ రింగ్ అయినా ఎవరూ ఎత్తలేదు. ఆపై సోమవారం ఉదయానికి స్విచ్చాఫ్ వచ్చింది. ఆ వెంటనే మమత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు కారులో ఎవరు వెళ్లారన్న విషయాన్ని విచారిస్తున్నామని పోలీసులు చెబుతుండగా, ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించక పోవడంతోనే ఇంత ఘోరం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మరణవార్త తెలిసి తోటి సింగర్స్ ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం. మరి ఈ సింగర్ హత్య గురించి అలాగే హత్య వెనుక ఆమె స్నేహితులే ఉన్నారని అనుకుంటున్నారా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.