Breaking News : గుండెపోటుతో టాప్ హీరోయిన్ మృతి.. షాక్ లో సినీ ఇండస్ట్రీ

905

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. ఈ మధ్య చాలా మంది ప్రముఖులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.ఆ మధ్య కన్నడ హీరో దేవ్ రాజ్ కు కూడా యాక్సిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన మరొక రోడ్డు ప్రమాదంలో నటులు రచన జీవన్ చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరు టాలీవుడ్ నటులు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఇప్పుడు మరొక హీరోయిన్ చనిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

2013లో వచ్చిన ‘కామసూత్ర 3డి’ మూవీలో లీడ్ రోల్ చేసిన సైరా ఖాన్ గుండెపోటుతో మరణించారు. రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మొదట షెర్లిన్ చోప్రాను లీడ్ రోల్‌గా అనుకున్నారు. పలు కారణాలతో ఆమె తప్పుకోవడంతో సైరా ఖాన్ ఆ అవకాశం దక్కించుకున్నారు. సైరా ఖాన్ హఠాన్మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రూపేష్ పాల్ స్పందించారు. ‘సంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం వల్ల కామసూత్ర 3డి చిత్రానికి సైన్ చేయడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది..సంప్రదాయవాద ముస్లిం కుటుంబానికి చెందిన అమ్మాయి కావడం, అలాంటి బోల్డ్ మూవీతో బాలీవుడ్లోకి అడుపెట్టడం ఆమెకు సవాలుగా మారింది. కొన్ని నెలల తర్వాత ఆమె ప్రయత్నం ఫలించింది. కాస్త ఆలస్యమైన ఒక మంచి నటి దొరికిందనే సంతృప్తి కలిగింది. ఆమెలా ఎవరూ చేసుండేవారు కాదు’ అని రూపేష్ పాల్ తెలిపారు.

Image result for సైరా ఖాన్

సైరా మరణం గురించి మీడియాలో ఎలాంటి వార్తలు రాలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రూపేష్ పాల్ ట్వీట్ చేశారు. ‘ఆమె మరణవార్త విని షాకయ్యాను. అయితే ఏ మీడియా సంస్థ కూడా ఈ విషాదం గురించి ప్రజలకు వెల్లడించక పోవడం ఆశ్చర్య వేసింది. ఆమె తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అయినా ఆమెను ఎవరూ గుర్తించక పోవడం బాధాకరం. సైరా ఖాన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను… అని రూపేష్ పాల్ ట్వీట్ చేశారు. ‘కామసూత్ర 3డి’ సినిమా ద్వారా బాలీవుడ్లోకి అడుగు పెట్టడానికి ముందే సైరా ఖాన్ కొన్ని రీజనల్ చిత్రాల్లో నటించారు. అయితే అవి పెద్దగా హిట్ కాకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. పలువురు సిని ప్రముఖులు ఆమె మృతికి నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.