Breaking News:ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్ర‌ముఖ యాంక‌ర్ మృతి

521

బిల్డింగ్‌పై నుంచి దూకి… ప్రముఖ టీవీ యాంకర్ రాధికా కౌశిక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం 3.30కి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగినట్టు తెలుస్తోంది. నోయిడాలోని సెక్షన్-77లో నివాసముంటున్న రాధికా కౌశిక్…నాలుగో అంతస్థులో ఉన్న తన ఇంటి బాల్కనీలోంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. రాధిక ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరగడానికి ముందు రాధికాను కలిసిన స్నేహితుడిని ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుంటున్నారు.

Image result for రాధికా కౌశిక్

శుక్రవారం ఉదయం అపార్ట్‌మెంట్ పార్కింగ్ స్థలంలో మహిళ శవాన్ని గుర్తించిన వాచ్‌మెన్… పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఆ మృతదేహం ప్రముఖ ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న రాధికా కౌశిక్‌ అని తేల్చారు. అప్పటికే ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న పోలీసులు… ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందించి… శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాజస్థాన్‌కు చెందిన రాధికా కౌశిక్… కొన్నాళ్లు అక్కడే ఓ న్యూస్ ఛానెల్‌లో రిపోర్టర్‌గా ఉద్యోగం చేసింది. పదోన్నతి ద్వారా నోయిడాకు బదిలీ అయిన ఆమె… కొన్ని నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడే ముందు రాధికా గదికి స్నేహితుడు రాహుల్ వచ్చినట్టు చెబుతున్నారు అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు… అసలేం జరిగిందనే విషయం గురించి విచారణ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

రాధికా కౌశిక్ యాంకర్ రాహుల్ తో సన్నిహితంగా ఉంటోంది . దాంతో ఇద్దరూ కలిసి నోయిడా లోని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ తీసుకొని సహజీవనం చేస్తున్నారు అని కొంద‌రు స్నేహితులు తెలియ‌చేశారు. .అయితే ఈరోజు ఉదయం నుండి ఇద్దరూ కలిసి ఫ్లాట్ లోనే మద్యం సేవిస్తూ ఉన్నారట ! మద్యం మత్తులో ఇద్దరి మధ్య వాదోపవాదాలు పెరగడంతో రాధికా కౌశిక్ ఫ్లాట్ నుండి కిందకు దూకేసి ఆత్మహత్య చేసుకున్నట్లు రాహుల్ చెబుతున్నాడు . పైగా రాధికా కౌశిక్ దూకే సమయంలో నేను వాష్ రూమ్ లో ఉన్నానని అందుకే కాపాడలేక పోయానని అంటున్నాడు . అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా ? లేక హత్య కు గురయ్యిందా ? అన్న విషయం తేలాల్సి ఉంది. ప్రస్తుతం రాహుల్ పోలీసుల అదుపులో ఉన్నాడు . ఇక రాధికా కౌశిక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు .