Breaking News : టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కన్నుమూత…శోక సంద్రంలో సినీ ఇండస్ట్రీ..

261

సిని ప్రముఖుల ఇళ్లలో వరుసగా విషాదఛాయలు అలుముకుంటున్నాయి. నిన్నకాక మొన్న బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి మన అందరికి తెలిసిందే.ఆ ఘటనను మరవకముందే ఇప్పుడు మరొక విషాద ఘటన టాలీవుడ్ లో అలుముకుంది. టాలీవుడ్ లో టాప్ దర్శకుడిగా నిర్మాతగా ఉన్న ప్రముఖ వ్యక్తి కన్నుమూశాడు. మరి ఆయనెవరో ఎలా చనిపోయాడో చూద్దామా.

Image result for విజయ బాపినీడు

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత విజ‌య బాపినీడు హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో అనారోగ్యంతో(86) క‌న్నుమూశారు. చిరంజీవి, శోభన్‌బాబు, క్రిష్ణ, మోహన్‌బాబుల‌తో హిట్ చిత్రాలు నిర్మించిన ఆయ‌న గ్యాంగ్ లీడ‌ర్, బిగ్ బాస్, ఖైదీ నెం 786, మ‌గ‌ధీరుడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్‌ని తెలుగు ప‌రిశ్ర‌మ‌కి అందించారు. చిరంజీవి తరవాత రాజేంద్ర ప్రసాద్‌తో బాపినీడు అత్యధిక సినిమాలు తెరకెక్కించారు.విజయ బాపినీడు అస‌లు పేరు గుత్తా బాపినీడు చౌదరి కాగా చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న విజ‌య బాపినీడుగా సుప‌రిచితం. 1936 సెప్టెంబరు 22 న సీతారామస్వామి, లీలావతి దంపతులకు ఏలూరుకు దగ్గరలో కల చాటపర్రు గ్రామంలో ఆయ‌న జన్మించారు. గణిత శాస్త్రంలో బి.ఎ డిగ్రీని ఏలూరు లోని సి.ఆర్.ఆర్ కళాశాలలో చేసారు. చిత్రసీమలోనికి రావడానికి పూర్వం ఆయన బొమ్మరిల్లు, నీలిమ పత్రికలకు సంపాదకునిగా పనిచేసారు.‘విజయ’ అనే ఎంటర్‌టైన్మెంట్ మ్యాగజైన్‌ను స్థాపించారు. ఆ తరవాత సినిమాల్లోకి అడుగుపెట్టారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

విజయ బాపినీడు ద‌ర్శ‌కుడిగా డబ్బు డబ్బు డబ్బు (1981),పట్నం వచ్చిన పతివ్రతలు (1982),మగమహారాజు (1983), మహానగరంలో మాయగాడు (1984), హీరో (1984), భార్యామణి (1984), మహారాజు (1985), కృష్ణగారడి (1985), మగధీరుడు (1986), నాకు పెళ్ళాం కావాలి (1987), ఖైదీ నెంబరు 786 (1988), దొంగకోళ్ళు (1988), మహారాజశ్రీ మాయగాడు (1988), జూలకటక (1989), మహాజనానికి మరదలు పిల్ల (1990), గ్యాంగ్ లీడర్ (1991), బిగ్ బాస్ (1995), కొడుకులు (1998), ఫ్యామిలీ (1994) వంటి చిత్రాలు చేశారు. నిర్మాతగా యవ్వనం కాటేసింది (1976) అనే చిత్రం చేశారు. సినిమా దర్శకులుగా, పత్రికా సంపాదకులుగా విజ‌య బాపినీడు సేవ‌ల‌ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.ఇటీవల చిరంజీవి రీ ఎంట్రీ తరువాత ఓ సినీ వేదిక మీద మాట్లాడిన ఆయన.. మరోసారి చిరును డైరెక్ట్ చేయాలనుందన్నారు. అయితే ఆ కోరిక తీరకుండానే ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు సినిమాకు ఎన్నో కమర్షియల్ సక్సెస్‌లను అందించటంతో పాటు చిరంజీవి టాప్‌ స్టార్‌గా ఎదగటంలో కీలక పాత్ర పోషించిన విజయ బాపినీడు మరణం పట్ల తెలుగు సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఆయ‌న మృతికి చిత్ర ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన ప‌లువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయ‌న ఆత్మ‌కి శాంతి క‌ల‌గాల‌ని కోరుతున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.