Breaking News : ప్రముఖ నటుడుకి ప్రమాదం.. ఆందోళనలో సినీ పరిశ్రమ

107

సినిమా ఇండస్ట్రీలో వరుసగా చేదు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.కొందరు ప్రముఖులు చనిపోతున్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు.ఈ మధ్యనే ఘోర కారు ప్రమాదంలో నటుడు రాజకీయనాయకుడు నందమూరి హరికృష్ణ అలాగే కన్నడ హీరో దేవ్ రాజ్ కు కూడా యాక్సిడెంట్ అయినా సంగతి మన అందరికి తెలిసిందే.అయితే ఇప్పుడు మరొక నటుడు ప్రమాదానికి గురయ్యాడు.మరి ఆ నటుడు ఎవరు అతనికి ఇప్పుడు ఎలా ఉంది.ఆ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for sudeep

కన్నడ స్టార్ హీరోలలో కిచ్చా సుదీప్ ఒకరు. విలక్షణమైన పాత్రలు ఎంచుకుంటూ నటుడిగా దూసుకుపోతున్నాడు. సుదీప్ కన్నడలో మాత్రమే కాదు దక్షణాది భాషలన్నిటిలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈగ చిత్రంతో తెలుగులో కూడా సుదీప్ పాపులర్ అయ్యాడు.సుదీప్ ఇప్పటికే తెలుగులో ఈగ, బాహుబలి వంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న క్రేజీ చిత్రం సైరా నరసింహారెడ్డిలో సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ లో సైరా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం కన్నడలో తెరకెక్కుతున్న ‘పైల్వాన్’ చిత్రంలో సుదీప్ నటిస్తున్నాడు.సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించి కారు సన్నివేశం షూట్ చేస్తున్నారు. ఈ సన్నివేశంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో సుదీప్ గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆందోళన అవసరంలేదని, స్వల్పగాయాలు అని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.

ఇటీవల సుదీప్ నటించిన ది విలన్ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు సుదీప్ హాజరు కావాల్సి ఉన్నా గాయాల కారణంగా హాజరు కాలేకపోయాడు. సుదీప్ కు గాయపడ్డ సంగతి అభిమానులకు తెలియడంతో పెద్ద ఎత్తున పూజలు మొదలు పెట్టారు. సుదీప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేశారు.తాను త్వరగా కోలుకోవాలని విష్ చేసిన అభిమానులందరికి సుదీప్ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలువృత్తిలో భాగమే అని తెలిపాడు. సినిమా విషయంలో మంచి ఫలితాలు తీసుకురావాలంటే ఇలాంటి చిన్న కష్టాలు తప్పవని సుదీప్ తెలిపాడు.ఆయన త్వరగా కోలుకోవాలని మనం కూడా కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సుదీప్ గురించి అలాగే ఆయనకు జరిగిన ప్రమాదం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.