Breaking News : జూనియ‌ర్ ఆర్టిస్ట్ ఆత్మ‌హ‌త్య కార‌ణం వింటే షాక్

389

సినిమా ఇండ‌స్ట్రీలో అవ‌కాశాల కోసం రోజూ వంద‌లాది మంది హైద‌రాబాద్ కు వ‌స్తూ ఉంటారు కొంద‌రికి అవ‌కాశాలు వ‌స్తే మ‌ర‌కొంద‌రికి ఎంత క‌ష్ట‌ప‌డినా అవ‌కాశాలు రావు ఇక ఇంట్లో నుంచి ఒత్త‌డి ఇక్క‌డ ప‌రిశ్ర‌మ‌లో అవకాశాలు రాక ఎంతో తీవ్ర ఒత్త‌డికి లోన‌వుతూ ఉంటారు.. ఇక ఇప్ప‌టికే సినిమా ఇండ‌స్ట్రీలో కొత్త‌వారి రాక త‌గ్గింది అనే చెప్పాలి ఒక్క అవ‌కాశం కోసం వేల సంఖ్య‌లో జ‌నాలు వ‌స్తున్నారు ఇక తాజాగా అవ‌కాశాలు రాక త‌మ ప్రాణాలు తీసుకుంటున్నారు అయితే ఇప్పుడు ఇలాంటి ఓ ఆత్మ‌హ‌త్య సంచ‌ల‌నం రేపింది హైద‌రాబాద్ లో. వివ‌రాల‌లోకి వెళితే…

Image result for FILM REELS

హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో జూనియర్ ఆర్టిస్ట్ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన ఇప్పుడు టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల మేరకు, మంగా టిఫిన్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న హృదయ లాడ్జిలో అర్జున్‌ గౌడ్‌ అనే యువకుడు, గత 20 రోజులుగా రూము అద్దెకు తీసుకుని ఉంటూ, సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్నాడు. ఈ స‌మ‌యంలో అత‌ను ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Image result for FILM REELS

కాని నిన్న అర్ధరాత్రి షూటింగ్‌ ముగించుకొని లాడ్జికి వచ్చిన అర్జున్ గౌడ్, కొన్ని టాబ్లెట్లు వేసుకొని పడుకున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న అతని స్నేహితుడు నాగ కార్తీక్, అవి ఎందుకని అడుగగా, దగ్గు మాత్రలు వేసుకున్నానని చెప్పి పడుకున్నాడు. కానీ నేటి ఉదయం ఎంతకీ అతను నిద్ర లేవక పోవడంతో స్నేహితుడు 108కు సమాచారం అందించగా, పరీక్షించిన సిబ్బంది మృతి చెందినట్లు తెలిపారు. నాగకార్తీక్‌ ఫిర్యాదుతో బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అర్జున్‌గౌడ్‌ వేసుకున్న మాత్రల వివరాలపై ఆరా తీస్తున్న పోలీసులు అవి నిజంగానే దగ్గు మాత్రలా ? లేదా ఇంకేదైనానా అనే దర్యాప్తు చేస్తున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక సినిమాల్లో చిన్న‌చిన్న వేషాలు వేస్తూ ఉంటాడ‌ని అత‌ని స్నేహితులు చెబుతున్నారు.. రాత్రి బ‌య‌ట నుంచి వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రితో అయినా వివాదాలు జ‌రిగాయా, అత‌నికి బ‌య‌ట ఎటువంటి గొడ‌వ‌లు అయినా ఉన్నాయా అని విచారిస్తున్నారు, దీనికి సంబంధించి పోలీసులు అన్నీ కోణాల్లో విచారిస్తున్నారు, అత‌ని ఫోన్ కాల్స్ డేటా అంతా క్షుణ్నంగా ప‌రిక్షీస్తున్నారు.. అలాగే ఇక్క‌డ ప్రేమ కార‌ణాలు అత‌నికి ప్రేమ వ్య‌వహారాలు కూడా ఉన్నాయా అనే కోణంలో ఆలోచిస్తున్నారు,అత‌ని మ‌ర‌ణంతో కొంద‌రు ఆర్టిస్టులు అత‌న్ని చూసేందుకు వ‌స్తున్నారు , చూశారుగా ఇండ‌స్ట్రీలో బాధ‌లు, సినిమా రంగానికి ఎన్నో క‌ల‌ల‌తో వ‌చ్చి, చివ‌ర‌కు అవేమి నెర‌వేరక ఆత్మ‌హ‌త్య చేసుకునే వారిని చాలా మందిని చూశాము.. మ‌రి అర్జున్ ఇలా త‌న ప్రాణాలను ఎందుకు తీసుకున్నాడు అనేది పోలీసుల విచార‌ణ‌లో తెలియాలి.. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.