Breaking News : ప్రమాదంలో కంటి చూపు కోల్పోయిన హీరోయిన్ కాజల్.. షాక్ లో ఇండస్ట్రీ

1040

అసలే స్మార్ట్ ఫోన్ల కాలం. స్కూల్ పిల్లాడి నుంచి సీనియర్ సిటిజన్ వరకు అందరి చేతుల్లోకి మొబైల్స్ వచ్చేశాయి. ముఖ్యంగా యువత ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకోబోయే వరకు అంతా ‘స్మార్ట్‌’గా గడిపేస్తోంది. ఓ అవసరంగా మన జీవితాల్లోకి వచ్చిన ఈ ఫోన్లు.. తర్వాత మన జీవితంలో ఓ భాగమైపోయాయి. రోజు రోజుకూ వీటి వాడకం ఎక్కువ కావడంతో.. అనర్థాలు పెరిగిపోతున్నాయి. 24 గంటలు ఫోన్ ను చూస్తూ ఉండటం వలన కంటి సమస్యలు వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కూడా నాలుగు కళ్ళతో చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు హీరోయిన్ కాజల్ కు కూడా అదే పరిస్థితి వచ్చింది. కాజల్ అంటే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అనుకునేరు కాదండి తమిళ్ ఇండస్ట్రీ నటి.

Image result for kajal

‘కో’ సహా కొన్ని చిత్రాల్లో నటించి,బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన నటీమణి కాజల్ పశుపతి, స్మార్ట్ ఫోన్ ను అతిగా వాడి తన కంటిచూపును సమస్యను కొనితెచ్చుకుంది.ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఆమె సోషల్‌ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేది. అయితే,కొంతకాలంగా ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడం గమనించిన అభిమానులు కంగారుపడ్డారు. గత కొంతకాలంగా ఆమె ట్విట్టర్ ఖాతాలో ఒక్క మెసేజ్ కూడా లేకపోవడంతో,అనుమానం వచ్చి ఒక అభిమాని అడగ్గా అప్పుడు, ఆమె సమాధానం చెప్పింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మొబైల్‌ ఫోన్‌లో అధికంగా గేమ్స్‌ ఆడడం వల్ల కంటిచూపు దెబ్బతిందని, సెల్‌ఫోన్‌ను చేతుల్లో కూడా పెట్టుకోవద్దని డాక్టర్‌ వార్నింగ్‌ ఇచ్చారని, అందువల్లే ట్విట్టర్‌లో సందేశాలు రావడం లేదని కాజల్‌ చెప్పింది. మొబైల్‌ అధిక వినియోగం వల్ల ఏర్పడే ఇబ్బందులను తను స్వయంగా అనుభవిస్తున్నానని, అభిమానులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆమె సూచించింది.కాబట్టి,కాజల్ అభిమానులే కాదు కళ్ళ మీద అభిమానం ఉన్న వారందరు స్మార్ట్ ఫోన్లను వీలైనంత తక్కువగా వాడితే కళ్ళు, ఒళ్ళు బాగుంటాయి.కాబట్టి జాగ్రత్త. మరి కాజల్ కు స్మార్ట్ ఫోన్ వలన వచ్చిన ఈ సమస్య గురించి అలాగే స్మార్ట్ ఫోన్ కు బానిస అయ్యి రోగాలను కొనితెచ్చుకుంటున్న యువత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.