breaking news : రోడ్డుప్రమాదంలో ‘గబ్బర్‌సింగ్‌’ నటుడికి తీవ్రగాయాలు.. షాక్ లో పవన్ కళ్యాణ్

223

సినీ ఇండస్ట్రీలో వరుసవిషాదఛాయలు అలుముకుంటున్నాయి. చాలా మంది ప్రముఖులు చనిపోతుంటే కొందరేమో రోడ్డు ప్రమాదాల కారణంగా తీవ్రగాయాల పాలవ్వడం జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు ప్రాంతంలో జరిగిన రోడ్డుప్రమాదంలో ‘గబ్బర్‌సింగ్’ నటుడు ఆంజనేయులు, ఆయన భార్య గాయపడ్డారు. ఇందిరానగర్‌ ప్రాంతంలో నివసించే ఆంజనేయులు(రాజశేఖర్‌ డూప్‌) తన భార్యతో కలిసి శనివారం రాత్రి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు మీదుగా గచ్చిబౌలి వైపునకు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వద్ద వీరి బైక్‌ను ఓ గుర్తుతెలియని కారు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఆంజనేయులు కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఆయన భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా డాక్టర్లు ఆంజనేయులుకి చికిత్స చేసి గాయాలకు కట్లు కట్టారు.

ఈ క్రింది వీడియో చూడండి

అనంతరం ఆంజనేయులు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ప్రమాదంపై ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారును గుర్తించే పనిలో పడ్డారు. ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా పుటేజీని పరిశీలిస్తున్నారు.గాయాల కారణంగా ఆంజనేయులు ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు సినిమాలే ఆధారమని, ప్రమాదంలో గాయపడటంతో షూటింగులకు వెళ్లడం కుదరడం లేదని, దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆంజనేయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టాలీవడ్ లో గబ్బర్ సింగ్ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ అన్న సంగతి మనకు తెలిసిందే. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో చూపించిన సినిమా ఇది. ఈ సినిమా నిర్మాతకు దర్శకుడికే కాదు అందులో నటించిన నటులకు కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ముఖ్యంగా సినిమాలలో విలన్ వేషాలు వేసే చిన్న చినన్ ఆర్టిస్టులకు ఈ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నా కూడా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిందని ఆ నటులందరూ చెప్తూ ఉంటారు.

Related image

ఆ సినిమాలో నవ్వులు పూయించే అంత్యాక్షరి సన్నివేశంలో ‘రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజా పువ్వా’ అనే సాంగ్‌కు రాజశేఖర్‌ను ఇమిటేట్ చేస్తూ ఆంజనేయులు చేసిన డ్యాన్స్ ఆయనకు ఎంతో పేరు తెచ్చింది. ఆ సన్నివేశంలో పాల్గొన్నవారంతా గబ్బర్‌సింగ్ గ్యాంగ్‌గా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. తమకు పవన్‌కళ్యాణ దేవుడని చెప్పే ఈ బ్యా్చ్ అంతా మొన్నటి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు ఆంజనేయులును గాయాలు అయ్యాయని తెలిసి తోటి నటులు అందరు పరామర్శించడానికి వెళ్లారు. ఈ విషయం తెలిసి పవన్ కళ్యాణ్ కూడా బాధపడ్డాడంట. ఫోన్ చేసి పరామర్శించినట్టు తెలుస్తుంది.