బ్రేకింగ్ న్యూస్: ప్రముఖ నటి కన్నుమూత శోకసంద్రం లో కుటుంబం తరలివస్తున్న నటులు

883

ఇటీవ‌ల చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌ముఖుల మ‌ర‌ణం క‌లిచివేస్తోంది. తాజాగా ఒడిశా చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. బుల్లి తెరపై నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న లక్ష్మి ప్రియా బెహరా అలియాజ్ నికిత ప్రమాదవ శాత్తూ మృతి చెందింది. నికిత మృతి గురించి ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్న వివరాలు అనుమానాలకు దారి తీస్తున్నాయి. నికిత కొన్ని సినిమాల్లో కూడా నటించింది. నికిత ఆరు నెలల పాపకు తల్లి కూడా. నికిత మృతితో ఒడిశా చిత్ర పరిశ్రమ, ఆమె సహనటులు విషాదంలో మునిగిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఒడిశాలో బుల్లితెర ప్రేక్షకులకు నికిత అభిమాన నటి. నికిత అంటే తెలియని వారుండరు. హోమ్లీ పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. నికిత మహానది విహార్ ప్రాంతంలో ఉండే తన తండ్రి నివాసానికి వెళ్లిందట. అక్కడ నికిత టెర్రస్ పై ఉండగా ప్రమాదవ శాత్తూ కిందపడడంతో తలకు బలమైన గాయం అయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.నికిత తల్లిదండ్రులు, భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఇది పూర్తిగా అనుకోకుండా జరిగిన ఘటన అని అంటున్నారు. నిఖితకు తలకు మినహా శరీరంలో ఎక్కడా పెద్ద గాయాలు కాలేదని చెబుతున్నారు. తలకు తగిలిన గాయం వల్ల మాత్రమే నికిత ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ స‌భ్యులు తెలియ‌చేశారు.

Image result for లక్ష్మి ప్రియా బెహరా

నికిత మృతి ప్రమాదం అని చెబుతున్నా.. ఆమె టెర్రస్ పై నుంచి కింద పడడానికి దారితీసిన పరిస్థితులని మాత్రం ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించడం లేదు. దీనితో నికిత మృతి పట్ల కొన్ని అనుమానాలు కూడా వెలువడుతున్నాయి. ఆరు నెలల క్రితమే నిఖితకు పాప కూడా పుట్టింది. ఆరు నెలల చిన్నారికి తల్లి అయిన నికిత ఇలా మృతి చెందడంతో బుల్లితెర నటులంతా విషాదంలో ఉన్నారు.ఇటీవల నికిత ఎక్కువగా భర్తకు దూరంగా ఉండడం కూడా అనుమానాలు బలపడేలా చేస్తోంది. 2016లో నిఖితకు, లిపాన్ సాహుకు వివాహం జరిగింది. నికిత తండ్రి నివాసానికి ఆమె భర్త కూడా వచ్చాడట. చోరీ చోరీ మానా చోరీ, స్మైల్ ప్లీజ్ లాంటి చిత్రాలలో నికిత నటించింది. ఏమైనా గొడ‌వ‌ల వ‌ల్ల ఆమె కింద ప‌డిందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.