Breaking News : బుల్లితెర నటి ఆత్మహత్యాయత్నం షాక్ లో బుల్లితెర నటులు..

439

సినిమా ఇండ‌స్ట్రీలో ఆత్మ‌హ‌త్య‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.. బుల్లితెర వెండితెర న‌టీన‌టులు ఆత్మ‌హ‌త్య‌లు ఇటీవ‌ల మ‌రింత పెరిగిపోతున్నాయి, ముఖ్యంగా అవ‌కాశాలు రాక అలాగే, సినిమా ఇండ‌స్ట్రీలో ఇబ్బందుల వ‌ల్ల, కొంద‌రి ప్రేమ‌ల వ‌ల్ల, ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. తాజాగా మ‌రో బుల్లితెర న‌టి ఆత్మ‌హ‌త్యయ‌త్యం చేశారు ఇప్పుడు బుల్లితెర‌లో ఇది విషాదం నింపింది.

బుల్లితెర నటి నీలాని ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నటి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. నీలాని చెన్నైలోని కేకే నగర్‌లో నివాసం ఉంటున్నారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సహాయ దర్శకుడు లలిత్‌ కుమార్‌ వేధిస్తున్నాడని ఆమె గతవారం మైలాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో అత‌నిపై అంద‌రూ విమర్శ‌లు చేశారు, ఇక చివ‌ర‌కు ఆయ‌న అనుకోని ప‌రిస్దితుల్లో బ‌య‌ట జ‌రుగుతున్న ఈ ప్ర‌చారంతో తీవ్ర మ‌నోవేధ‌న‌కు గురి అయ్యారు.

ఆ తర్వాత లలిత్‌ కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. నీలాని పెళ్లికి తిరస్కరించడం వల్లే ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారంటూ మీడియా కథనాలు రాసింది. దీంతో లలిత్‌ కుమార్‌ మృతి చెందిన మరుసటి రోజున నీలాని పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సోషల్ ‌మీడియాలో వస్తున్న కామెంట్లు, మీడియాలో ప్రసారమవుతున్న కథనాలు తనను కుంగుబాటుకు గురి చేశాయని ఆమె అన్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనోవేదనకు గురైన నీలాని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. దోమలను చంపే రసాయనం సేవించారు అని తెలుస్తోంది. ఎంత సేపు అయినా ఆమె ఇంట్లోంచి బ‌య‌ట‌కు రాకపోవ‌డంతో ఇంట్లో ఆమెని గుర్తించారు ఇంటి ప‌క్క‌న వారు, ఇక వెంట‌నే ఆసుపత్రికి తరలించారు. వేధింపుల క‌న్నా ఇలా త‌న‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం ఆమె త‌ట్టుకోలేకపోయారు అని అంటున్నారు.. ఇలాంటి దారుణమైన మాటల వ‌ల్ల ఆమె మాన‌సికంగా కృంగిపోయిందని తెలుస్తోంది, దీనిపై కేసు న‌మోదుచేసిన పోలీసులు విచారణ జ‌రుపుతామ‌ని తెలియ‌చేశారు, చూశారుగా దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.