స్టార్ హీరోయిన్ బతకదు.. తేల్చి చెప్పేసిన డాక్టర్స్… షాక్ లో సినీ ఇండస్ట్రీ.. ఎవరో తెలిస్తే కన్నీళ్లే…

490

సాఫీగా సాగుతున్న సోనాలీ బింద్రే జీవితంలో క్యాన్సర్‌ రూపంలో పెద్ద కుదుపు. గతేడాది షాకింగ్‌ మూమెంట్స్‌లో ఇదొకటి. క్యాన్సర్‌ అని తెలియగానే సోనాలీ ఎంత షాకయ్యారో ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అంతే షాక్‌కి గురయ్యారు. ఎంత గొప్ప సమస్యను దాటగలిగితే అంత గొప్ప హీరో అయినట్టు, హీరోయిన్‌ సోనాలి క్యాన్సర్‌ను ధైర్యంగా ఎదుర్కొని.. పోరాడి గెలిచి సూపర్‌ హీరోయిన్‌గా నిలిచారు. ఎంతోమందికి స్ఫూర్తిగా మారారు. క్యాన్సర్‌ చికిత్స జరుగుతున్నంత కాలం సోషల్‌ మీడియా ద్వారా విషయాలను షేర్‌ చేశారు. ఇటీవల తిరిగి ముంబయి వచ్చారు. క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ.. బాధితుల్లో ఆత్మస్థైర్యం పెంచడానికి సోనాలి ముందడుగు వేశారు. క్యాన్సర్‌ ఉందని తెలిసిన కొత్తలో తన భావాల్ని ఓ వేదికపై పంచుకున్నారు.

Related image

‘చికిత్స కోసం న్యూయార్క్‌ వెళ్లినప్పుడు క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని వైద్యులు చెప్పారు. బతికే అవకాశం కేవలం ముప్పై శాతం ఉందని అన్నారు. న్యూయార్క్‌ వెళ్లాలని నా భర్త గోల్డీ బెహెల్‌ నిర్ణయించుకున్నారు. నాకు వెళ్లడం ఇష్టం లేదు. విమానంలో కూడా ఆయనతో పోట్లాడుతూనే వెళ్లా. ‘నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? మనకు ఇక్కడ మంచి వైద్యులు ఉన్నారు. నన్నెందుకు వేరే దేశానికి తీసుకెళ్తున్నావు?’ అని గొడవపడ్డా. నా ఇంటిని, ఊరిని చాలా మిస్‌ అవుతా అనుకున్నా. ఓ మూడు రోజులు ఉండి వచ్చేద్దాం అనుకున్నా. కానీ ఏమైందో నాకే తెలియదు. చూద్దాం, ప్రయత్నిద్దాం అన్నట్లు ఉండిపోయా. న్యూయార్క్‌లో అడుగుపెట్టాం. తర్వాతి రోజు వైద్యుల్ని కలిశాం. అన్నీ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్‌ నాలుగో దశలో ఉందని, బతికే అవకాశం ముప్పై శాతం మాత్రమే ఉందని చెప్పారు. నిజంగా ఆ మాటలతో నాకు బుద్ధి వచ్చింది. ఆ క్షణం గోల్డీను చూసి.. ‘నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు’ అన్నా.

ఈ క్రింది వీడియో చూడండి 

చికిత్స జరిగినంత కాలం సాఫీగా సాగిపోయిందంటే నేను అబద్ధం చెబుతున్నట్టే. ఈ ప్రయాణంలో చాలా నొప్పి కూడా దాగుంది. సర్జరీ జరిగిన తర్వాత లైఫ్‌ చాలా టఫ్‌గా గడిచింది. నా శరీరం మీద ఆపరే షన్‌ తాలూకా 20 అంగుళాల మచ్చ ఉండిపోయింది. ఆపరేషన్‌ థియేటర్‌కు వెళ్లే ముందు మా సిస్టర్‌ నన్ను కౌగిలించుకుంది. ‘మరీ అంత డ్రామా వద్దు. మళ్లీ తిరిగొస్తాను’ అని చెప్పా. కానీ ఎక్కడో ‘నా అబ్బాయికి, మా ఫ్యామిలీకి నేను ఉండనేమో?’ అనే ఆలోచనే చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించింది. ఆపరేషన్‌ జరిగి బయటకు రాగానే ‘నేను బతికే ఉన్నాను. శారీరక బాధ బాధే. ఆ బాధ సుదీర్ఘం కాదు. కానీ శారీరక బాధ కన్నా మానసిక బాధ మరింత బాధాకరం. అది మనిషిని కుంగదీస్తుంది’ అనిపించింది అని సోనాలి గుర్తు చేసుకున్నారు.మరి సోనాలి బింద్రే గురించి ఆమె క్యాన్సర్ ను జయించిన విధానం గురించి అనుభవించిన బాధ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.