Breaking News : పీకలదాకా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోయిన స్టార్ హీరో… షాక్ లో ఇండస్ట్రీ

289

డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యడం తప్పని మన అందరికి తెలుసు.మద్యం తాగి నడపడం వలన జరిగే ప్రమాదాలు ఎన్నో.ఆ ప్రమాదాల వలన రోడ్డున పడ్డవారు ఎందరో.అందుకే డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు విధిస్తున్నాయి.సామాన్య జనం అంటే ఏమో అనుకోవచ్చు కానీ సమాజానికి మంచి చెప్పాల్సిన సెలెబ్రిటీలు సైతం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడుతుండడం చూస్తూనే ఉన్నాం. మద్యం సేవించి భాద్యత రాహిత్యంగా వాహనాలు నడిపే సెలెబ్రిటీలు ఇప్పటివరకు చాలా మంది అరెస్ట్ అయి పరువు తీసుకున్నారు. తాజాగా మరొక నటుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యాడు. మరి ఆయనెవరు తెలుసుకుందామా.

బిగ్‌బాస్ సెలెబ్రిటీగా

తమిళ నటుడు శక్తి వాసుదేవన్ మద్యం సేవించి వాహనం నడుపుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి దిగ్గజ దర్శకుడు పి వాసు తనయుడు కావడంతో ఈ వార్త మరింతగా వ్యాపించింది. శక్తి వాసుదేవన్ ఎన్ని చిత్రాల్లో నటించినా సరైన గుర్తింపు లభించలేదు. తమిళ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్‌తో శక్తి మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం మంగళవారం సాయంత్రం శక్తి మద్యంసేవించి ప్రమాదకరంగా వాహనం నడుపుతుండడంతో అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. చెన్నై నగర శివారులో చూలైమేడు ప్రాంతంలో ఓ కారు ప్రమాదకరంగా జనాలపైకి దూసుకుని వస్తోంది. అక్కడున్నవారంతా అప్రమత్తంగా ఉండడంతో ప్రమాదం తప్పింది. రాష్ డ్రైవింగ్ చేస్తున్న అతడిని అడ్డుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అతడి వాహనాన్ని ఆపి కిందికి దిగాలని డిమాండ్ చేశారు. అతడిని చూడగానే బిగ్ బాస్ సెలెబ్రిటీ శక్తి అని జనం అంతా ఆశ్చర్యపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేయగా పూర్తిగా మద్యం మత్తులో ఉండిపోయాడు. కనీసం అతడు నిలబడలేని పరిస్థితి నెలకొంది. దీనితో పోలీసులు అతడి వాహనంలోనే పోలీస్ స్టేషన్ కు తరలించారు. అతడిపై పలు సెక్షన్స్ కింద డ్రంక్ అండ్ డ్రైవ్ కేసునమోదు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్ పై విడుదలైనట్లు తెలుస్తోంది. దిగ్గజ దర్శకుడు పి వాసు కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయిన శక్తి ఇంత వరకు తనదైన మార్క్ ప్రదర్శించలేక పోయాడు. పైగా ఇలాంటి కేసులు అతడి కుటుంబ ప్రతిష్టని దిగజార్చేలా ఉన్నాయి. శక్తి స్నేహితులు అతడిని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. శక్తి ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన ఈ నటుడి గురించి ఆలాగే ఇలా తప్పతాగి పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్న సెలెబ్రిటీల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.