Breaking News : ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డి ఇంట విషాదం

287

మంచి కామెడీ టైమింగ్ ఉన్న న‌టుడు శ్రీ‌నివాస‌రెడ్డి. మొద‌ట్లో హీరో స్నేహితుడిగా క‌నిపిస్తూ వ‌చ్చాడు.గీతాంజ‌లి త‌ర‌వాత కామెడీ హీరోగా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశాడు శ్రీ‌నివాస‌రెడ్డి. జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురాతో ఓ ఫ్లాప్ మూట‌గ‌ట్టుకున్నాడు..ఇప్ప‌టికీ త‌న చేతిలో సినిమాలున్నాయి. త‌ర్వాత అంజ‌లితో న‌టించిన గీతాంజ‌లి ప‌ర‌వాలేద‌నిపించింది. ఇటీవ‌ల విడుద‌లైన ఆనందం బాగున్నా శ్రీ‌నివాస‌రెడ్డికి హీరోగా నిల‌దొక్కుకునేందుకు హెల్ప్ అయ్యింది, ఇక త‌న టైమింగ్ లెంగ్తీ కామెడీ సీన్స్ చేయ‌డంలో శ్రీనివాస‌రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయ‌న ఇంట విషాదం అల‌ముకోవ‌డంతో సినీ ఇండ‌స్ట్రీలో వారు శ్రీనివాస‌రెడ్డి ఇంటికి వెళుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రముఖ నటుడు శ్రీనివాసరెడ్డికి పితృవియోగం కలిగింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. అనారోగ్యం కారణంగా శ్రీనివాసరెడ్డి తండ్రి వై.రామిరెడ్డి జనవరి 24న కన్నుమూశారు. ఆయన నటుడిగా కూడా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమే. శ్రీనివాసరెడ్డి కథానాయకుడిగా వచ్చిన ‘జయమ్ము నిశ్చయమ్మురా’ చిత్రంలో ఉపాధ్యాయుడిగా కనిపించారు. అలాగే ప్రస్తుతం ఆయన హోం ప్రొడక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో కూడా రామిరెడ్డి నటిస్తున్నారు. ఆయ‌న వ‌య‌సు 84 సంవ‌త్స‌రాలు. ఇక ఆయ‌న మృతితో ప‌లువురు శ్రీనివాస‌రెడ్డి ఇంటికి వ‌చ్చి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు, ఇక సినిమాల్లో ఆయ‌న న‌టించ‌డంతో చాలా మంది సీనియ‌ర్ న‌టులు ఆయ‌న లేరు అనేవిష‌యం జీర్ణించుకోలేక‌పోతున్నారు, ఇక శ్రీనివాస‌రెడ్డి సినిమాల్లోకి వ‌చ్చిన స‌మ‌యంలో ఆయ‌న వెన్నంటి ఉన్నారు అని ఎటువంటి ప్లాఫ్స్ వచ్చినా అదైర్య ప‌డ‌కుండా దైర్యం చెప్పారు అని శ్రీనివాస‌రెడ్డి బంధువులు చెబుతున్నారు.మరి ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని కోరుకుందాం.