Breaking News : సింగర్ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం.. తరలివస్తున్న సినీ లోకం..

796

ప్రముఖుల ఇళ్లలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి .అటు సినీ ఇటు రాజకీయ రంగ ప్రముఖుల ఇళ్లలో విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న శ్రీనివాస్ రెడ్డి తల్లి చనిపోవడం గురించి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మరొక సినీ ప్రముఖుడి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం అంటే తెలియ‌ని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డేమో.. ఆయ‌న‌కు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం కూడా అవ‌స‌రం లేదు.తెలుగు సింగర్స్ అందరికిఆ ఆయనే ఆదర్శం.సింగింగ్ ను కెరీర్ గా ఎంచుకునే అందరికి ఆయనే మార్గదర్శకుడు. దాదాపుగా 50 వేల పాటలు పాడిన అనుభవం ఆయనది. అంతేకాకుండా దేశ విదేశాలలో ఎన్నో స్టేజ్ షోలు చేశాడు.

Image result for sp balu

ప్రస్తుతం వస్తున్న సింగర్స్ కు టిప్స్ చెప్తూ వారి ఉన్నత భవిష్యత్ కు పునాది వేసేపనిలో ఉన్నాడు. పాడుతా తీయగా అనే పోగ్రామ్ ద్వారా ఎంతో మంది సింగర్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు.పాడుతా తీయగలో గెలిచినా ఎందరో ఇప్పుడు టాప్ సింగర్స్ గా కొనసాగుతున్నారు. అంతేకాకుండా స్వచ్చంద సంస్థలను నడిపిస్తున్నాడు. ఇంత చేస్తున్న బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో ఇవాళా విషాదం చోటు చేసుకుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన తల్లి శకుంతలమ్మ(89) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం నెల్లూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. సంగీత కచేరీ నిమిత్తం ఆయన అక్కడికి వెళ్లారు. అయితే తల్లి మరణవార్త తెలియగానే ఎస్పీబీ హుటాహుటిన స్వస్థలానికి బయలుదేరారు. ఈ రోజు సాయంత్రానికి ఆయన ఇంటికి చేరుకుంటారని బంధువులు చెబుతున్నారు. శంకుతలమ్మ అంత్యక్రియలు రేపు(మంగళవారం) నెల్లూరులో నిర్వహించనున్నారు. ఎస్పీబీ తల్లి మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మనం కూడా కామెంట్ రూపంలో ఆమె మృతికి నివాళి అర్పిద్దాం.