BREAKING NEWS: శ్రీరెడ్డి మర్డర్.. ఇంట్లోని సిసి కెమెరా ఫ్యూటేజ్ చూసి షాకైన పోలీసులు

874

ఇటీవల కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ లో కి హీరోయిన్లుగా రావాలనుకునే తెలుగు అమ్మాయిలను క్యాస్టింగ్ కౌచ్ పేరుతో కొందరు మేనేజర్లు మరియు సినిమా కోఆర్డినేటర్లు, వారిపై అకారణంగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఆకృత్యాలకు దిగుతున్నారని వర్ధమాన నటి శ్రీరెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఈ విషయమై ఆమె మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు అర్ధనగ్నంగా ధర్నా కూడా చేపట్టింది. అయితే చివరకు ఆమె చేసిన పోరాటానికి దిగివచ్చిన మా అసోసియేషన్, ఇకపై అటువంటి చర్యలు జరగకుండా చూసుకుంటామని అలానే సినిమాల్లోకి వచ్చే అమ్మాయిలకు భద్రత కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇలాంటి వాటి వెనుక ఉన్న కొంద‌రు హీరోల పేర్లు ప్ర‌ముఖుల పేర్లు బ‌య‌ట‌పెట్టింది శ్రీరెడ్డి.

Image result for sree reddy

ఇక ఆతర్వాత శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ ని మరియు ఆయన ఫ్యాన్స్ ని టార్గెట్ చేసి వివాదాల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. అలానే కొన్నాళ్ల నుండి మెగా బ్రదర్ నాగబాబుకు పోటీగా ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి, మెగా ఫ్యామిలీ పై తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇక ఇటీవలే హైదరాబాద్ నుండి చెన్నై కి మకాం మార్చిన శ్రీ రెడ్డి పై ఆమె స్వగృహంలో తీవ్ర దాడి జరిగినట్లు సమాచారం. అసలు విషయం ఏంటంటే, తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న శ్రీ రెడ్డి, ఆమె మేనేజర్ పై ఒక మూవీ ఫైనాన్షియర్ మరియు అతని మేనల్లుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. వారి దాడిని కొంత ప్రతిఘటించిన శ్రీరెడ్డికి కొన్ని గాయాలయ్యాయని, అయితే చివరకు ఎలాగో స్థానిక పోలీసులకు ఫోన్ చేయడంతో హుటాహుటిన వారు ఘటనాస్థలికి రావడం అలానే దాడికి పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని సమాచారం.

ఇక దాడి సమయంలో శ్రీరెడ్డి మేనేజర్ కి స్వల్ప గాయాలు అవ్వగా, శ్రీరెడ్డి కాలుకి కొంత దెబ్బ త‌గిలిందని, వెంటనే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించడం జరిగిందని పోలీసులు చెప్పారు. ఆమెపై దాడికి తెగబడ్డ ఫైనాన్షియర్ ఇదివర‌కు గతంలో ఆమెను లైంగికంగా వేధించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, ఆకక్షను కడుపులో పెట్టుకొని ఇప్పుడు శ్రీరెడ్డిపై మరొకసారి అతడు దాడికి తెగబడినట్లు సమాచారం. కాగా ఈ ఘటన ప్రస్తుతం సినిమా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది….. మ‌రి ఆ వ్య‌క్తి వివ‌రాలు గోప్యంగా ఉన్నాయి అని తెలుస్తోంది. మ‌రి శ్రీరెడ్డి ఈ విష‌యం పై కూడా సీరియ‌స్ గా ఉంద‌ట‌.