BREAKING NEWS దేశం దాటి పారిపోతుంటే శివాజీ అరెస్ట్

219

హీరో శివాజీని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో శివాజీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్ నుంచి సైబరాబాద్ క్రైమ్ పీఎస్కు తరలించారు. అలందా మీడియా పెట్టిన కేసులో శివాజీని కస్టడీలోకి తీసుకున్నారు.

Image result for hero sivaji

శివాజీ దేశం దాటి వెళ్లిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. శివాజీని అరెస్ట్ చేయబోమన్నారు. కోర్టు ఆదేశాల మేరకు సీఆర్పీసీ నోటీసులు జారీ చేస్తామన్నారు. అలాగే విచారణకు సహకరించాల్సిందిగా కోరినట్లు తెలిపారు. నోటీసులు ఆధారంగా శివాజీని విచారిస్తామని సైబరాబాద్ పోలీసులు పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న తర్వాత ఆయన ఇంటికెళ్లిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

టీవీ9 వాటాల విషయంలో మాజీ సీఈవో రవిప్రకాశ్, హీరో శివాజీ ఫోర్జరీకి పాల్పడినట్లు అలందా మీడియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఈ కేసులో రవిప్రకాశ్ను విచారించారు. శివాజీకి కూడా పలుమార్లు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు హాజరుకాలేదు. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ శివాజీ హైకోర్టును ఆశ్రయించారు.