Breaking News : శారద కన్నుమూత..షాక్ లో సినీ ఇండస్ట్రీ…

1047

ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ఉన్న ప్రముఖులు చనిపోవడమో లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు ఈ మధ్య వరుసగా చనిపోతున్నారు. మొన్నటికి మొన్న దర్శకుడు కోడిరామకృష్ణ ఆ తర్వాత బెంగాలీ హాస్య బ్రహ్మ చిన్మయి రాయ్ కనుమూశారు. వాళ్ళ మరణాన్ని మరవకముందే ఇప్పుడు ఒక సినీ నటి కన్నుమూసింది.

Image result for శారద కన్నుమూత

సీనియర్ కన్నడ నటి ఎల్‌.వి. శారదా(79) కన్ను మూశారు. కొంతకాలంగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోనిఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆమె ఆరోగ్యం విషమించి ఆసుపత్రి లో తుదిశ్వాస వదిలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫణియమ్మ, వంశవృక్ష, ఆదిశంకరాచార్య, భూతయ్యన మగ తో పాటు పలు కన్నడ సినిమాలలో శారద నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈమె చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో పలురకాల పోగ్రామ్స్ లలో నటించింది. ఎన్నో నాటకాలు కూడా వేసింది. నటనను మెరుగుపరుచుకుని సినీ రంగంలో అడుగుపెట్టింది. ఇండస్ట్రీకి వచ్చిన కొద్దీ కాలంలోనే తన నటనతో అందరిని మెప్పించింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఆ తర్వాత ఎందరో కన్నడ సూపర్ స్టార్స్ తో కలిసి నటించింది. ఇలా మంచి మంచి చిత్రాలు తీసి కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది. శారదా కొన్ని తెలుగు సినిమాలలో కూడా నటించింది. అయితే తెలుగులో ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరు రాకపోవడంతో తెలుగు ప్రజలకు ఆమె అంతలా తెలీదు. శారద మృతి పట్ల కన్నడ సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దర్శకులు, నిర్మాతలతో పాటు క్యారెక్టర్‌ నటులు శారద మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు చెన్నేగౌడతో పాటు సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.