Breaking News : చిత్రపరిశ్రమలో విషాదం.. సినీ హీరోయిన్ మృతి..

611

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులు హఠత్మరణం చెందుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఓ వైపు యువ నటులు ఆత్మహత్యలు మరో వైపు సీనియర్ నటులు, దర్శక, నిర్మాతల మరణం చిత్ర పరిశ్రమని టెన్సన్ పెడుతుంది. రీసెంట్ గా టాలీవుడ్ లో ప్రముఖ నటుడు దీక్షితులు గుండెపోటుతో మరణించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత బాలీవుడ్ నిర్మాత, క్లాసిక్ చిత్రాల నిర్మాతగా పేరొందిన రాజ్ కుమార్ బార్జాత్య మృతి చెందారు.ఈ విషాదాల నుంచి బయటపడకముందే మరొక హీరోయిన్ చనిపోయారు.

Image result for సంఘమిత్ర రాయ్ ఛటర్జీ

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఎదుగుతున్న యువ నటి సంఘమిత్ర రాయ్ ఛటర్జీ గురువారం ఉదయం చనిపోయారు. ఆమె కొన్నిరోజులుగా బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. బ్రెయిన్ క్యాన్సర్ సోకిన విషయం తెలిసిన తర్వాత సినిమాలు తగ్గించేసి… చికిత్స తీసుకుంటున్న ఆమె కొంతకాలంగా కోలుకున్నట్టుగానే కనిపించింది. అయితే గురువారం హఠాత్తుగా క్యారాబెల్ అటాక్ రావడంతో ఆమె మృత్యువాత పడింది. దాదాపు రెండేళ్ల పాటు మరణంతో పోరాడి, ఓడిపోయింది సంఘమిత్ర రాయ్ ఛటర్జీ. దర్శకుడు రింగ్‌నో బెనర్జీ, నటి సంఘమిత్ర మరణవార్తను ఫేస్‌బుక్ ద్వారా తెలియచేశాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

రింగ్‌నో బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘దామిని’ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది సంఘమిత్ర రాయ్. అంతేకాకుండా గత ఏడాది వచ్చిన ‘గహీన్ హృదయ్’ సినిమాలోనూ నటించిందామె. ఈ సినిమాలతో పాటు ‘దేక్ కమాన్ లగే’ మూవీలో కూడా నటించింది సంఘమిత్ర. నటిగా, మోడల్‌గానే కాకుండా నిర్మాతగానూ రాణించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఓ సినిమా నిర్మాణంలో భాగం పంచుకుంటోంది సంఘమిత్ర. నిర్మాత ప్రదీప్ చురీవాల్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్న సంఘమిత్ర… బుధవారం రాత్రి 8:30 దాకా నిర్మాత ఆఫీసులోనే ఉండింది. పెళ్లి చేసుకుని, విడాకులు తీసుకున్న సంఘమిత్రకు ఆరేళ్ల కూతురు కూడా ఉంది. అయితే ఆమె తన భర్త నుంచి విడాకులు తీసుకుని.. వెండితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం కొన్నిరోజుల క్రితం ఆమె ఓ షార్ట్ ఫిల్మ్ కూడా తీసినట్టు సమాచారం. ఈ లఘు సినిమాను ఎడిట్ చేయాల్సిందిగా తనను కోరిందని, అంతలోనే ఆమె మరణవార్తను వినాల్సి వస్తుందని ఊహించలేదని వాపోయాడు దర్శకుడు రింగ్‌నో బెనర్జీ.ఆమె మృతికి ఆయన సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పించారు.ఆమెతో పరిచయాలు ఉన్న పలువురు సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పించారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.