breaking news..సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ కూతురు ఆత్మహత్య..కారణం ఏమిటో తెలిస్తే కన్నీళ్ళే..

641

తెలుగునాట వెండితెర అమ్మగా అగ్రేశర స్థాయిలో వెలుగొందిన ఏకైక నటీమణి అన్నపూర్ణ.. అలియాస్‌ అన్నపూర్ణమ్మ. ఆడుతూ పాడుతూ చలాకీ పాత్రలు చేయాల్సిన వయసులో కావాలనే అమ్మ, అక్క, వదిన.. ఇలా గుండెల్ని తడిచేసే పాత్రల్నే ఎంపిక చేసుకుని.. ‘చేస్తే అలాంటి పాత్రలే చేస్తా..!’ అంటూ మంకుపట్టుపట్టి మరీ.. సినిమాల్లో అమ్మగా నెగ్గుకొచ్చిన ఘనతా అన్నపూర్ణమ్మకే దక్కుతుంది. అలా నాలుగు దశాబ్దాలకుపైగా సినిమాల్లో రాణిస్తూ సినీప్రేక్షక హృదయాల్లో ‘అమ్మ’గా ముద్రపడింది.అయితే ఇప్పుడు ఆ అమ్మతనాన్నే ఆమె మిస్ అయ్యింది.ఆమె కూతురు కీర్తి ఆత్మహత్య చేసుకున్నారు.

Image result for annapurnamma

ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అనారోగ్య సమస్యలే కీర్తి ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఆమె ఒక తీవ్రమైన రోగంతో బాధపడుతున్నారని సమాచారం.ఆ జబ్బును నయం చెయ్యడానికి ఇప్పటికే అన్నపూర్ణమ్మ చాలా డబ్బు ఖర్చు చేశారని తెలుస్తుంది.నా కోసం అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తున్నారని కీర్తి తన తల్లితో కూడా చెప్పిందంటా.మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అన్నపూర్ణ ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె తెనాలి నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించారు.వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంతా-కనకం, పూలరంగడు మొదలైనవి.1975లో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన స్వర్గం నరకం సినిమాలో మోహన్ బాబు సరసన కథానాయకిగా తెలుగు సినీరంగంలో పరిచయమైంది. ఆ సినిమా నిర్మాణ సమయంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు ఈమె పేరును అన్నపూర్ణగా మార్చాడు.ప్రస్తుతం హైదరాబాద్ లోనే స్థిరపడింది.అయితే ఈమె కూతురు మరణ వార్త విని ఆమె కుప్పకూలిపోయింది.సినిమా పెద్దలు ఆమె కూతురి మరణానికి నివాళులు అర్పించారు.మా అసోసియేషన్ కూడా ఆమె మృతికి నివాళులు తెలిపింది.మరి మనం కూడా కామెంట్ రూపంలో నివాళులు అర్పిద్దాం..