Breaking News:జబర్దస్త్ కి కోలుకోలేని షాకిచ్చిన రోజా, నాగబాబు

191

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ఒక సంచలనం. ఇప్పటి వరకు తెలుగులో రేటింగ్స్ పరంగా ఈ షోని బీట్ చేసే షో ఇంకోటి లేదు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు .ఇక ఈ షో మొదలైన తరువాత తెలుగు సినీ పరిశ్రమకి ఎంతో మంది కొత్త కమెడియన్స్ దొరికారు. చాలా మంది ఆర్టిస్ట్ లకి ఈ షో నే లైఫ్ ఇచ్చింది. అయితే ఎంత మంది ఉన్నా, ఎన్ని ఉన్నా జబర్దస్త్ కి లైఫ్ ఈ రేంజ్ కి రావడానికి జడ్జెస్ ముఖ్య ఒక కారణం. టీమ్ లీడర్స్ పార్టీస్ పేంట్స్ ఎంత కష్టపడి నవ్వులు పూయించినా జడ్జెస్ కనుక ఆ సెన్స్ అర్ధం చేసుకొని మనసు పూర్తిగా నవ్వకపోతే కామెడీ షోలు హిట్ అవ్వవు. అయితే ఈ విషయంలో జబర్డస్త్ కి లోటు లేదు నాగబాబు రోజా.. లాంటి ఇద్దరు జడ్జెస్ జబర్దస్త్ జడ్జెస్ గా పెర్ఫెక్ట్ గా సెట్ అయిపోయారు. అందుకే ఆ నాటి నుండి ఈనాటి వరకు జడ్జ్ గా ఇంకెవరు మారలేదు.

Image result for naga babu roja

వీరిలో ఎవరు డుమ్మా కొట్టినా కూడా వారి ప్లేస్ లో నాని మంచు లక్ష్మి అల్లరి నరేష్ లాంటి వాళ్ళు వచ్చి జడ్జిగా చేశారు.అయితే ఇప్పుడు వీళ్లిద్దరు ఒకేసారి జబర్దస్త్ మానేస్తున్నారు .అందుకు కారణం ఏపీలో ఎన్నిలలు జరగడం. రోజా నాగబాబు ఇద్దరు ఈసారి ఎన్నికలలో నిలబడుతున్నారు. రోజా ఇదివరకే నగరి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఇప్పుడు మరొకసారి పోటీ చేస్తుంది. ఇక నాగబాబు ఏమో తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరి నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నాడు. ఈసారి ఇద్దరు జడ్జీలు ఎన్నికలలో నిలబడ్డారు. దాంతో జబర్దస్త్ ఏమవుతుందా అని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకముందు ఒకరు కాకపోయినా మరొక వచ్చేవారు కానీ ఇప్పుడు ఇద్దరు రావడం లేదు.

ఏపీలో ఎన్నికలు ఏప్రిల్ 11 న జరగనున్నాయి. ఆ తరువాత 45 రోజులకు రిసల్ట్స్ వస్తాయి. అంటే ఇన్ని రోజులు నాగబాబు రోజా మరె కార్యక్రమంలో పాల్గొనరు. ఇప్పటికే రోజా రెండు వారాల నుంచి రావడం లేదు. ఇప్పుడు నాగబాబు కూడా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నాడు కాబట్టి ఇకపై నాగబాబు కూడా రాడు. దాంతో ఇద్దరు జబర్దస్త్ జడ్జీలు ఒకేసారి మానేస్తున్నారు.వీళ్ళు లేని జబర్దస్త్ ను ఊహించుకోవడం చాలా కష్టం.ఎందుకంటే టీమ్ లీడర్స్ కామెడీ చేసిన చెయ్యకపోయినా కానీ మనస్ఫూర్తిగా నవ్వి జనాలను అట్రాక్ చేసేది వీళ్ళే. ఈ ఇద్దరు లేకుండా ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా జరగలేదు. మొదటిసారి ఇద్దరు జడ్జీలు రావడం లేదు. ఇది జబర్డస్ట్ కు కొంచెం నష్టం కలిగించేదే అని చెప్పుకోవాలి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. నాగబాబు రోజా జబర్దస్త్ కు రాకపోవడం నష్టమా కాదా.. మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.