Breaking News : రజనీకాంత్ మీద కేసు నమోదు.. కారణం తెలిస్తే షాక్…

278

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 2.0 చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబడుతోంది. మరోవైపు రజని పెట్ట చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల విడుదలైన పెట్ట చిత్ర టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా రజనీకాంత్ ఓ కేసులో ఇరుక్కున్నాడు. మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for SUPERSTAR RAJINI

ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు ధనుష్ ను రజనీకాంత్ అల్లుడిగా చేసుకున్న విషయం తెలిసిందే. ధనుష్ సూపర్ స్టార్ అల్లుడు కావడంతో రజనీకాంత్, ప్రముఖ దర్శకుడు కస్తూరి రాజా వియ్యంకులు అయ్యారు. రజనీకాంత్, కస్తూరి రాజా వియ్యంకులు అయ్యే వరకూ బాగానే ఉంది. తరువాత అసలు కథ మొదలైయ్యింది. 2012లో ప్రముఖ ఫైనాన్షియర్ ముకుంద్ సంత్ బోత్రా అనే ఆయనతో కస్తూరి రాజాకు పరిచయం అయ్యింది. ఆ సమయంలోఇద్దరూ ఆర్థిక లావాదేవీలు చర్చించుకున్నారు. 2012లో ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా మైహున్ రజనీకాంత్ అనే సినిమా నిర్మించడానికి సిద్దం అయ్యారు. ఆ సందర్బంలో ఆయన కస్తూరి రాజాను కలిశారు. రజనీకాంత్ పేరుతో సినిమా తీస్తున్నామని, అందుకు అనుమతి ఇప్పించాలని ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రా మనవి చేశారు. రజనీకాంత్ పేరుతో తీసే సినిమాకు తాను అనుమతి ఇప్పిస్తానని, అందు కోసం రూ. 40 లక్షలు గుడ్ విల్ ఇవ్వాలని చెప్పిన కస్తూరి రాజా ఆ మొత్తం నగదు తీసుకున్నారు. తరువాత ముకుంద్ బోత్రా మైహున్ రజనీకాంత్ సినిమా ప్రారంభించారు.

తరువాత కస్తూరి రాజా తనకు రూ. 25 లక్షలు అవసరం ఉందని, తాను ఇవ్వకుంటే రజనీకాంత్ ఇస్తారని నమ్మించి లిఖితపూర్వకంగా బాండు రాసి సంతకం చేసి చెక్ లతో సహ ఫైనాన్షియర్ ముకుంద్ బోత్రాకు ఇచ్చాడు. కస్తూరి రాజా ఇచ్చిన చెక్ లు బ్యాంకులో వెయ్యడంతో అవికాస్తా బౌన్స్ అయ్యాయి. రజనీకాంత్ ను సంప్రధించి బాండు చూపించి నగదు ఇవ్వాలని ముకుంద్ బోత్రా మనవి చేశారు. ఆ సందర్బంలో తనపేరు చాల మంది దుర్వినియోగం చేస్తున్నారని, తనకు సంబంధం లేదని రజనీకాంత్ సమాధానం ఇచ్చారని ముకుంద్ బోత్రా ఆరోపించారు.బోత్రా తన అప్పు చెల్లించలేదని కోర్టుకు ఎక్కాడు. ఈ వివాదంలో రజనీకాంత్ తనని దూషించాడు అంటూ బోత్రా పరువునష్టం దావా వేశాడు. దీనిపై విచారణ జరిగిపిన న్యాయస్థానం రజనికి ఊరట కల్పించింది. రజనీకాంత్ ఆ అప్పుని తీర్చేసినట్లు తేలింది. రజనీకాంత్ తో వివాదం పెట్టుకుని పబ్లిసిటీ పొందాలని భావించిన బోత్రాకు చురకలు అంటిస్తూ రజినీపై నమోదు చేసిన కేసుని కొట్టివేసింది. చూడాలి మరి బోత్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. బోత్రా రజని మీద పెట్టిన ఈ కేసు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.