Breaking News : మరొక వివాదంలో రష్మీ…. పెద్దగా అవుతున్న చిన్న గొడవ..

3050

జబర్దస్త్ పోగ్రాం ద్వారా పాపులర్ అయిన రష్మికు యూత్ లో ఉన్న క్రేజ్ తెలిసిందే. దాన్ని ఆమె మాత్రమే కాకుండా వేరే వాళ్లు కూడా క్యాష్ చేసుకోవాలని చూడటం దగ్గరే సమస్య వస్తోంది. ఆమె తనకున్న ఫాలోయింగ్ తో అనేక ప్రారంభోత్సవ కార్యక్రమాలు, ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తోంది. ఆమె తాను వస్తున్నానని కన్ఫర్మ్ చేసి హోర్డిగ్స్ పెట్టుకుంటే ఇబ్బంది లేదు. కానీ ఆమెను పిలవకుండానే రేష్మి వస్తోందంటూ హోర్డింగ్స్ పెట్టి పబ్లిసిటీ చేసి జనాలని మోసం చేయాలనుకుంటే ఇబ్బందే.ఇప్పుడు ఒక కార్యక్రమ నిర్వాహకులకు రష్మీకి మధ్య దాని మీదనే వివాదం నడుస్తుంది.అసలు ఏమైందో పూర్తీగా తెలుసుకుందామా.

Related image

యాంకర్‌గానే కాకుండా నటిగానూ గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ రష్మి. ఆమె ఈ మధ్య పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో కూడా సందడి చేస్తున్నారు. కాగా ఆదివారం తిరుపతిలో జరగనున్న ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మి హాజరు కాబోతున్నారని కొందరు హోర్డింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ ఫొటోను చూసిన రష్మి ట్విటర్‌లో స్పందించారు. అసలు ఆ కార్యక్రమ నిర్వాహకులు తనను సంప్రదించలేదని స్పష్టం చేశారు. ‘ఈ ఈవెంట్‌లో నా భాగస్వామ్యం లేదు. నా అనుమతి, ప్రమేయం లేకుండా నా ఫొటోల్ని పెట్టేస్తారు. కార్యక్రమం స్పాన్సర్లు ఎవరైనా తెలిస్తే ఈ వార్త తెలియజేయండి’ అని రష్మి నెటిజన్లకు చెప్పారు.దీంతో సదరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తి రష్మికి రిప్లై ఇచ్చారు. ‘ఈ కార్యక్రమానికి వచ్చేందుకు మేం రష్మికి అడ్వాన్స్‌ కూడా ఇచ్చాం. ఆమె రావడానికి ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు దాన్ని ఖండిస్తున్నారు. నేను ఆమె మేనేజర్‌కు డబ్బులు పంపా.. ఆధారాలు కూడా ఉన్నాయి చూడండి. దీనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా’ అంటూ కొన్ని స్క్రీన్‌ షాట్లు పంపారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆయన మాటలకు రష్మి ప్రతిస్పందించారు. ఏదైనా చెప్పేముందు కాస్త నిజానిజాలు తెలుసుకోవాలని అన్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అబద్ధాలుగా తేలుతాయని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటే అలానే చేయండని చెప్పారు.దీనికి మరో వ్యక్తి రష్మికి మద్దతుగా మాట్లాడారు. ఏదైనా ఉంటే ఆమె మేనేజర్‌ సూరి బాబుతో మాట్లాడాలని అన్నారు. రష్మి తాము నిర్వహించిన పలు కార్యక్రమాలకు వచ్చారని, ఆమె చాలా నిబద్ధత కల్గిన వ్యక్తని, తప్పుపట్టొద్దని చెప్పారు. ఆయనకు రష్మి ధన్యవాదాలు తెలిపారు.చూడాలి మరి ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.రష్మీకి మరియు కార్యక్రమ నిర్వాహకులకు మధ్య జరుగుతున్న ఈ రగడ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.