Breaking News:ప్రముఖ సింగర్ ఇంట్లో విషాదం..శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ

148

ప్రముఖుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.సినీ ప్రముఖులు వరుసగా చనిపోవడం లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోయి వారిని దుఃఖ సాగరంలో ముంచడం జరుగుతూనే ఉన్నాయి.ఈ మధ్యనే సింగర్ నితిన్ బాలీ ,మ్యూజిక్ డైరెక్టర్ బాల భాస్కర్,నటుడు హరికృష్ణ.. ఇలా ప్రముఖులందరూ చనిపోవడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.ఇప్పుడు మరొక ప్రముఖ సింగర్ ఇంట్లో విషాదం నెలకొంది.మరి ఆ విషయం గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for సోనూనిగమ్

సోను నిగమ్ గురించి మన అందరికి తెలిసిందే.అతను ఇండియాలో ఉన్న ఫెమస్ సింగర్స్ లలో ఒకడు.అతను హిందీ ,కన్నడ, ఇంగ్లీష్, బెంగాలీ, మణిపురి, గుజరాతీ, తమిళం, తెలుగు, మరాఠీ, తులు, అస్సామీ, ఒడియ, నేపాలీ, మైథిలి మరియు అనేక భారతీయ భాషలలో పాడారు. నిగమ్ ఇండియన్ పాప్ ఆల్బమ్లను కూడా విడుదల చేశాడు మరియు అందులలో నటించాడు.. అతను అత్యధిక పారితోషకం కలిగిన భారతీయ గాయకులలో ఒకడు. ఎక్కువగా “ఆధునిక రఫీ” గా పేరు పొందాడు., ఇప్పుడు హిందీ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత బహుముఖ గాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు.సోనూనిగమ్ తెలుగులో ‘ప్రాణం’ సినిమాలో ‘నిండు నూరేళ్ల సావాసం’ పాటతో పాటు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘అడవి రాముడు’, ‘శకుని’, ‘జీన్స్’, ‘షిర్డీసాయి’, ‘గోపాల గోపాల’ తదితర సినిమాల్లో పాటలు పాడారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇప్పుడు ఆయన ఇంట్లో విషాదం నెలకొంది. సోనూనిగమ్ మామ కన్నుమూశారు. సోనూనిగమ్ 2002లో మధురిమను వివాహం చేసుకున్నారు. అంతకుముందు సోనూ ఆమెతో డేట్‌లో ఉన్నారు. ప్రస్తుతం సోనూ దంపతులకు ఒక కుమారుడు. ఈరోజు మధురిమ తండ్రి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.పలువురు ప్రముఖులు ఆయనకు నివాళి అర్పిస్తున్నారు.మనం కూడా కామెంట్ రూపంలో ఆయనకు నివాళి అర్పిద్దాం.