Breaking News :ప్రముఖ హీరోయిన్ కార్ ఆక్సిడెంట్

396

మనం ఈ మధ్య ప్రతిరోజు యాక్సిడెంట్ కేసుల గురించి వింటుంటే చదువుతూనే ఉన్నాం. ప్రతి రోజు వందలకొద్దీ యాక్సిడెంట్ ఘటనలు జరుగుతున్నాయి.సామాన్య ప్రజలకు జరిగితే అది పెద్ద న్యూస్ కాదు కానీ అదే ఏ సెలెబ్రిటీకి అయినా జరిగితే మాత్రం అది పెద్ద న్యూస్ అవుతుంది,. చాలా మంది సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలు వదిలారు. ఇప్పుడు ఒక హీరోయిన్ కారుకు కూడా రోడ్డు ప్రమాదం జరిగింది.మరి ఆమె ఎవరు ఆమెకు ఎలా ఉందొ ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for జరీన్ బాలీవుడ్

బాలీవుడ్ నటి వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. గోవాలోని అంజునా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అంజునా ఇన్‌స్పెక్టర్ సీఎల్ పాటిల్ కథనం ప్రకారం.. బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ తన ఇన్నోవా వాహనంలో బుధవారం సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో నగోవా నుంచి కలన్‌గట్ బీచ్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్‌పై వెళ్తున్న మితేష్ గోరల్‌ను నటి వాహనం ఢీకొట్టింది. అయితే బైక్ అతి వేగంగా రావడం కూడా ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు. హెల్మెట్ లేకపోవడంతో తీవ్రంగా గాయపడ్డ మితేష్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మితేష్ అప్పటికే చనిపోయాడని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇన్నోవా వాహనం ఎవరు నడిపారన్నదానిపై స్పష్టత లేదు, కానీ నటి జరీన్ ఖాన్ కారు డ్రైవర్‌ అబ్బాస్ అలీపై పోలీసులు కేసు నమోదు చేశారు.

2010లో వచ్చిన సల్మాన్ ఖాన్ మూవీ ‘వీర్’తో జరీన్ బాలీవుడ్ తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొదట్లో విక్రమ్‌భట్ దర్శక నిర్మాతగా తెరకెక్కించిన 1921 సినిమాలో జరీన్‌ నటించారు.. తన మేనేజర్ వేధిస్తుందని ఇటీవల ఫిర్యాదు నమోదు చేసిన జరీన్ తాజాగా రోడ్డు ప్రమాదం కేసులో ఇరుక్కున్నారు. హిందీతో పాటు కొన్ని తమిళ, పంజాబీ చిత్రాల్లోనూ జరీన్ ఖాన్ నటించింది.ఏది ఏమైనా ఈ విధంగా జరగడం విచారకరమని తన డ్రైవర్ జాగ్రత్తగా ఉండకపోవడం వలనే ప్రమాదం జరిగిందని,డ్రైవర్ ఎప్పటినుంచో తన దగ్గర పనిచేస్తున్నాడని ఇలా జరగడం ఎంతో విచారకరమని ఆ కుటుంబానికి కావాల్సిన వసతులు నేను చూసుకుంటా అని జరీన్ ఖాన్ చెప్పింది. గోవాలో షూటింగ్ కోసం అని వెళ్లి ఇలాంటి ఒక ఘటనను ఎదుర్కోవడం నా జీవితంలో మరచిపోలేని ఘటన అని ఆమె తెలిపింది. ఇది యాదృచ్చికంగా జరిగింది కానీ ఎవరు కావాలని చెయ్యరు కదా అని చెప్పింది.తన డ్రైవర్ కు బెయిల్ ఇప్పించే పనిలో జరీన్ ఖాన్ ఉంది. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.జరీన్ ఖాన్ గురించి అలాగే ఆమె కారు ప్రమాద ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.