Breaking News : ప్రముఖ నటుడు కన్నుమూత, ఆందోళనలో అగ్రహిరోలు..

451

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టుల మ‌ర‌ణాలు కోలుకోలేని విధంగా షాక్ కు గురిచేస్తున్నాయి.. టాలీవుడ్ లో ఈ ఏడాది మేటి న‌టులు చాలా మంది ఈ లోకం విడిచివెళ్లారు.. వీరి మ‌ర‌ణంతో సీనీ ప‌రిశ్ర‌మ కోలుకోలేక తీవ్ర దిగ్ర్బాంతికి గురి అయింది. ఇక హ‌రికృష్ణ మ‌ర‌ణం నుంచి ఇంకా టాలీవుడ్ కోలుకోలేదు, ఇక తాజాగా నేడు మ‌రో సీనియ‌ర్ న‌టుడు క‌న్నుమూశారు, ఆయ‌న తెలుగ త‌మిళ క‌న్న‌డ మ‌ళ‌యాల భాష‌ల్లో చాలా సినిమాల్లో న‌టించారు. ఆయ‌నకు టాలీవుడ్ లో ఎంద‌రో స‌న్నిహితులు ఉన్నారు ఆయ‌నే కెప్టెన్ రాజు. ఆయ‌న హైట్ ఆయ‌న న‌ట‌న సినిమాల‌కు ప్ల‌స్ అయ్యేది ఆర్మీ ఆఫిస‌ర్ నుంచి సినిమాల్లోకి ప్ర‌వేశించారు ఆయ‌న‌.

Image result for కెప్టెన్‌ రాజు

ప్ర‌ముఖ మలయాళ నటుడు, దర్శకుడు రాజు డానియెల్‌ అలియాస్‌ ‘కెప్టెన్‌ రాజు కన్నుమూశారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ్‌, ఇంగ్లీష్‌ వంటి పలు భాషల్లో 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన స్వయంగా రెండు మలయాళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. తొలుత ఆర్మీ అధికారిగా పనిచేసిన కెప్టెన్‌ రాజు అనంతరం ఆ ఉద్యోగాన్ని వదిలి నాటక రంగంలోకి ప్రవేశించారు.

1980ల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన రాజు ప్రతినాయకుడి పాత్రలకు ప్రసిద్ధి పొందారు. తెలుగులో ‘బలిదానం’, ‘శత్రువు’, ‘రౌడి అల్లుడు’, ‘కొండపల్లి రాజా’, ‘జైలర్‌ గారి అబ్బాయి’, ‘గాండీవం’, ‘మొండి మొగుడు పెంకి పెళ్లాం’, ‘మాతో పెట్టుకోకు’ వంటి చిత్రాల్లో నటించారు. మలయాళంలో 1997లో తొలిసారి ‘ఒరు స్నేహగథా’తో దర్శకుడిగా మారారు. అనంతరం 2012లో ‘పవనాయి 99. 99’ చిత్రానికి దర్శకత్వ వహించడమే కాక ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించారు. ఆయ‌న మ‌ర‌ణంతో టాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో సీని పెద్ద‌లు షాక్ కు గురి అయ్యారు ఆయ‌న‌కు అన్ని చిత్ర‌ప‌రిశ్ర‌మ‌ల్లో స‌న్నిహితులు ఉన్నారు ఇటు టాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టులు అంద‌రూ ఆయ‌నతో న‌టించిన‌వారు, ఆయ‌న మృతిప‌ట్ట టాలీవుడ్ సంతాపం తెలియ‌చేసింది. మీరు కూడా ఆయ‌న ఆత్మ‌కు శాంతిచేకూరాల‌ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.