Breaking News:మోహన్ బాబు ఇంట్లో విషాదం

585

డైలాగ్ కింగ్ మోహన్ బాబు ఇంటిలో దొంగతనం జరిగింది. హైదరాబాద్ లోని ఇంటిలో నగదు, ఆభరణాలు చోరీకి గురైనట్లు మోహన్ బాబు మేనేజర్ చంటి ఈరోజు పోలీసులను ఆశ్రయించారు….దీంతో ఈ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. లక్షల రూపాయల నగదుతో పాటు నగలు చోరికి గురయ్యాయనీ, తమకు పనిమనిషి మీదే అనుమానం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో ఇంటిలో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఇలా దొంగ‌త‌నం జ‌రిగింద‌ని ప‌నిమనిషిపై అనుమానం ఉంది అని మోహ‌న్ బాబు మేనేజ‌ర్ ఇచ్చిన ఫిర్యాదులో తెలియ‌చేశారు.

Image result for mohan babu house

దీంతో ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కాగా, ఈ కేసు విషయంలో దర్యాప్తు ప్రారంభించామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుని నగదు, ఆభరణాలను రికవరీ చేస్తామన్నారు. గతంలో మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో చాలాకాలం నమ్మకంగా పనిచేసిన ఓ వ్యక్తి రూ.2 లక్షలు దొంగతనం చేశాడు. ఇలాగే నిర్మాత ఇంట్లో కూడా కొంద‌రి ఇళ్ల‌ల్లో ఇలా దొంగ‌త‌నాలు జ‌రిగాయి. అయితే వీటీపై పూర్తిగా పోలీసులు అనుమానితుల‌పై విచార‌ణ జ‌రిపి ఈ దొంగ‌ల‌ను ప‌ట్టుకున్నారు . మోహ‌న్ బాబు విష‌యంలో కూడా క‌చ్చితంగా వారి ఇంటిలో జ‌రిగిన దొంగ‌త‌నం కేసు త్వ‌ర‌లో చేదిస్తామ‌ని చెబుతున్నారు పోలీసులు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఈ ఫిర్యాదు రావ‌డంతో ఇంట్లో పనిచేసే పనిమనుషులను విచారిస్తున్నారు పోలీసులు… దొంగలు ఎవరు అనే విషయాన్ని త్వరలోనే తేలుస్తామని పోలీసులు అంటున్నారు. సెలెబ్రిటీల ఇళ్లలోని వస్తువులు చోరీకి గురికావడం ఇటీవల కాలంలో కామన్ గా మారిపోయింది. తెలిసిన వ్యక్తుల్లో లేదంటే ఇంట్లో పనిచేసే వ్యక్తులో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. మోహన్ బాబు మేనేజర్ చంటి ఫిర్యాదు చేశారు. మ‌రి చూడాలి పోలీసులు ఈ కేసు ఎప్పుడు చేదిస్తారో.