BREAKING NEWS జానీ మాస్టర్‌కు 6 నెలల జైలు శిక్ష షాక్ తో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ

251

సినిమా అంటే 24 క్రాఫ్ట్ అన్ని క‌ళ‌లు స‌మ‌పాళల్లో ఉంటేనే సినిమా మంచి స‌క్సెస్ అవుతుంది.. అందులో డ్యాన్సులు కూడా ఎంతో ముఖ్యం. అందుకే డ్యాన్స్ కొరియోగ్రాఫ‌ర్ సినిమాలో హీరో చేత అదిరిపోయే స్టెప్పులు వేయిస్తాడు. జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. రాంచరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అదిరిపోయే స్టెప్పులు వేయించడంలో జానీ మాస్టర్ దిట్ట. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక పలు చిత్ర పరిశ్రమల్లో జానీ మాస్టర్ అగ్ర హీరోలతో స్టెప్పులు వేయిస్తున్నారు. తాజాగా జానీ మాస్టర్ పెద్ద చిక్కుల్లో చిక్కుకున్నాడు. జానీ మాస్టర్ కు మేడ్చల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

Image result for jani master

2015కి చెక్ బౌన్స్ అయిన వివాదంలో జానీ మాస్టర్ పై చీటింగ్ కేసు నమోదైంది. జానీ మాస్టర్ పై 2015లో సెక్షన్ 354, 324, 506 కింద కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విషయంలో కోర్టు ఎట్టకేలకు తుది తీర్పు వెల్లడించింది. జానీ మాస్టర్ కు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ప్రకటించింది. చెక్ బౌన్స్ కేసుతో పాటు, మరిన్ని చీటింగ్ వ్యవహారాల్లో జానీ మాస్టర్ ని కోర్టు నిందితుడిగా ప్రకటించింది.జానీ మాస్టర్ పై నమోదైన కేసులపై గత నాలుగు ఏళ్లుగా విచారణ జరుపుతున్న న్యాయస్థానం, సెక్షన్ 354 కేసులో వాస్తవం లేదని కొట్టివేసింది. మిగిలిన 324, 506 సెక్షన్స్ కింద నమోదైన కేసులు నిజమే అని నిర్ధారిస్తూ శిక్ష విధించింది. జానీ మాస్టర్ తో పాటు మరో ఐదుగురికి కూడా మేడ్చల్ న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.

ఈ క్రింది వీడియో చూడండి

ప్రమాదకర ఆయుధాలు ఉపయోగించినప్పుడు, గాయపరిచినప్పుడు, హత్యాయత్నం చేసినప్పుడు 354 సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. జానీ మాస్టర్ అలాంటి పనులేవీ చేయలేదని కోర్టు నిర్ధారించడంతో ఆ సెక్షన్ కింద నమోదైన కేసుని కొట్టివేసింది. కోర్టు సంచలన తీర్పు వెల్లడించడంతో జానీ మాస్టర్ కుటుంబ సభ్యులు ఇంకా స్పందించలేదు. ఆయన బెయిలు దరఖాస్తు చేసుకుంటారా అనే విషయం ఇంకా తెలియలేదు.జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా అనేక సూపర్ హిట్ సాంగ్స్ కు కొరియోగ్రఫీ అందించారు. చాలా మంది హీరోలు, అభిమానులు జానీ మాస్టర్ కొరియోగ్రఫీని ఇష్టపడతారు. 2009లో టాలీవుడ్ లో అడుగు పెట్టిన జానీ మాస్టర్ ఎన్టీఆర్, రాంచరణ్, బాలయ్య, అల్లు అర్జున్, చిరంజీవి, రవితేజ, ప్రభాస్ లాంటి హీరోలందరికీ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు.