BREAKING NEWS : హీరో విశాల్ అరెస్ట్.. చెన్నై లో ఉద్రిక్త పరిస్థితులు

398

త‌మిళ‌నాడులో క్రేజ్ ఉన్న న‌టుల్లో విశాల్ ఒక‌రు. ఇక తమిళ్ లో ఆయ‌న చేసే సినిమాలు సూప‌ర్ స‌క్సెస్ అవుతున్నాయి. ఆయ‌న‌కంటూ మాస్ ఫాలోయింగ్ ను స‌పరేట్ గా పెంచుకున్నారు విశాల్, ఆయ‌న ఎంచుకునే క‌థ‌ల రూటే స‌పరేటు అని చెప్పాలి. ఇక విశాల్ త‌మిళ‌నాడులో రైతుల‌కు ఎంతో మంచి సాయం చేస్తున్నారు…ప‌త్రీ టిక్కెట్ పై రూపాయి తీసుకుని ఆ న‌గ‌దుని రైతుల‌కు ఖ‌ర్చుచేసి, రైతుల పై త‌న అభిమానాన్ని చూపించాడు విశాల్ ..అయితే ఇప్పుడు విశాల్ అభిమానుల‌కు ఓ షాకింగ్ వార్త అనే చెప్పాలి.

Image result for vishal

త‌మిళ హీరో, త‌మిళ నిర్మాత‌ల మండలి అధ్య‌క్షుడు విశాల్‌ను చెన్నై సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. టి.న‌గ‌ర్‌లోని యోగాంబ‌ల్ వీధిలో ఉన్న ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ ఆఫీస్ త‌లుపును బ‌ల‌వంతంగా తెరిచేందుకు విశాల్ ప్ర‌య‌త్నించ‌డంతో, పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తైనాంపేట పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. నేనెలాంటి త‌ప్పూ చేయ‌లేదు. నా కార్యాల‌యంలోకి వెళ్లేందుకు న‌న్ను అనుమ‌తించ‌లేదు. అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తే ఇలా పోలీసుల‌తో అరెస్ట్ చేయిస్తున్నారు` అని మీడియాతో మాట్లాడుతూ విశాల్ చెప్పాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

త‌మిళ సినీ రంగానికి చెందిన కొంద‌రు నిర్మాత‌లు కొద్ది రోజులుగా నిర్మాత‌ల మండలి అధ్య‌క్షుడిగా ఉన్న విశాల్‌పై పోరాటం చేస్తున్న సంగ‌తి తెల‌సిందే. అధ్య‌క్షుడిగా ఉన్న విశాల్ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటూ చిన్న సినిమాల‌ నిర్మాత‌ల‌ను ఇబ్బందులు పెడుతున్నాడ‌ని, ప‌లు క్రిమిన‌ల్ చ‌ర్య‌ల‌కు పాల్పడుతున్నాడ‌ని ఆరోపిస్తూ వారంతా నిర‌స‌న తెలియజేస్తున్న సంగ‌తి తెలిసిందే. విశాల్ త‌క్ష‌ణ‌మే నిర్మాత‌ల సంఘం అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తూ.. స్థానిక టి.న‌గ‌ర్‌లో ఉన్న నిర్మాత‌ల మండ‌లి కార్యాల‌యానికి తాళం వేశారు. ప్ర‌స్తుత కార్య‌వ‌ర్గాన్ని ర‌ద్దు చేసి, మ‌ళ్లీ ఎన్నిక జ‌ర‌పాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. దీంతో టి.న‌గ‌ర్ కార్యాల‌యానికి గురువారం వ‌చ్చిన విశాల్ తాళం బ‌ద్ద‌లుగొట్టి త‌లుపులు తెరిచేందుకు ప్ర‌య‌త్నించారు. ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు విశాల్‌ను అదుపులోకి తీసుకున్నారు.ఇక రేపు ఒకే రోజు 9 సినిమాలు విడుద‌ల చేయ‌డం ఏమిటి, దీనికి విశాల్ ఎలా ఒప్పుకుంటారు అని చిన్న నిర్మాత‌లు ఆయ‌న్ని ప్ర‌శ్నించారు, చివ‌ర‌కు 9 సినిమాలు విడుద‌ల చేసేందుకు అంద‌రూ నిర్మాత‌లు ముందుకు వ‌చ్చారు .. ఇలా అయితే చిన్న నిర్మాత‌లు న‌ష్ట‌పోతాము అని నిన్న‌టి నుంచి వారు విశాల్ ని విమ‌ర్శిస్తున్నారు, ఈ స‌మ‌యంలో ఇలా అరెస్ట్ జ‌ర‌గ‌డం పై పెద్ద ఎత్తున చ‌ర్చ అయితే కోలీవుడ్ లో జ‌రుగుతోంది.