Breaking News : టాలీవుడ్ టాప్ హీరోయిన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న హీరో విశాల్..

468

సెలబ్రిటీల పెళ్లిపై రకరకాల గాసిప్స్ నడుస్తూనే ఉంటాయి. టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి తంతు అదిగో ఇదిగో అంటూ రూమర్స్ నడుస్తూ.. గత ఐదేళ్లుగా రోజుకో నటితో ప్రభాస్ పెళ్లి జరిపించేస్తూనే ఉన్నారు గాసిప్ రాయుళ్లు. ఇక టాలీవుడ్‌లో ప్రభాస్ పెళ్లి కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో.. కోలీవుడ్‌లో విశాల్ పెళ్లి వార్త కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తమిళ హీరో విశాల్ తెలుగు అమ్మాయిని పెళ్లాడబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విశాల్ వార్తల్లోకి వచ్చేశారు. ఆ అమ్మాయి ఒక హీరోయిన్ అవ్వడంతో ఇప్పుడు అందరు ఈ పెళ్లి గురించి తెగ చర్చించుకుంటున్నారు. మరి విశాల్ చేసుకోబోయే ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందామా.

Image result for HERO VISHAL

ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్ నడిగర్ సంఘం నూతన భవనం పూర్తయ్యేవరకు పెళ్లి చేసుకోనని అప్పట్లో ప్రకటించారు. ఇక ఈ భవనం డిసెంబర్ నాటికి పూర్తి కానుండటంతో జనవరిలో ప్రారంభోత్సవం జరిపి అదే భవనంలో తొలి పెళ్లివేడుకను నిర్వహించడం కోసం అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లు ఈ వార్తల సారాంశం. అయితే విశాల్ తమిళ హీరో అయినప్పటికీ ఆయన పుట్టి పెరిగింది తిరుపతిలోనే కావడంతో తెలుగు ప్రజలతో మంచి అనుబంధమే ఉంది. పైగా విశాల్ తండ్రి, తాతలు కూడా తెలుగు వారే కావడంతో విశాల్ పెళ్లి చేసుకునే అమ్మాయి తెలుగు అమ్మాయే అన్న వార్తలకు బలం చేకూరుతుంది. ఇకపోతే.. ఇప్పటికే 40 క్రాస్ చేసిన విశాల్.. గతంలో శరత్ కుమార్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమ వ్యవహారం నడిపారు. అయితే తరువాత శరత్ కుమార్‌తో వివాదంతో వరలక్ష్మితో లవ్‌కి బ్రేకప్ చెప్పేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇప్పుడు విశాల్ ఇంట్లో విశాల్ కోసం ఒక తెలుగమ్మాయిని ఒకే చేసారనే వార్తలు వస్తున్నాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు. హీరోయిన్ శ్రీదివ్య. బాలనటి నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన ఈమె తెలుగులో అంతలా గుర్తింపు తెచ్చుకోకున్నా తమిళ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్ళింది. విశాల్ తో కలిసి రాయుడు అనే సినిమాలో ఈమె నటించింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడిందని మంచి స్నేహితులుగా మారానని అందరు అనుకున్నారు. వీళ్ళ స్నేహాన్ని చుసిన కుటుంబ సభ్యులు వీళ్లకు పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకుని వీళ్లిద్దరి పెళ్లి ఫిక్స్ చేసినట్టు కోలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.అయితే ఈ విషయం మీద అటు విశాల్ ఫామిలీ గానీ ఇటు శ్రీదివ్య ఫామిలీ గానే అధికారికంగా ప్రకటించలేదు.వాళ్ళు చెప్పేంతవరకు ఎదురుచూడాలి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. విశాల్ శ్రీదివ్య పెళ్లి గురించి బయటకు వచ్చిన ఈ వార్త గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.