Breaking News:హీరో గోపీచంద్ కు యాక్సిండెంట్.. షాక్ లో ప్రభాస్

344

మనకి నిత్యం కనిపించే రంగాలలో సిని రంగం కూడా ఒకటి అయితే అందులో కనిపించే ప్రతి ఒక్కరికి మానవాళితో ఎంతో కొంత సంబంధం ఉంటుంది.వెండితెర మీద కానీ బుల్లితెర మీద కానీ నటులు స్తంట్స్ చెయ్యడం లేదా సీన్ కోసం కష్టతరమైన జంపింగ్స్ చెయ్యడం లాంటివి చేస్తూ ఉంటారు.పెద్ద పెద్ద హీరోలు కూడా ప్రాణాలను లెక్కచెయ్యకుండా స్తంట్స్ చేస్తూ ఉంటారు. సీన్ మంచిగా రావడం కోసం అలా చేస్తుంటారు.అయితే అలా చేసే సమయంలో వాళ్ళకు పెద్ద పెద్ద గాయాలు కూడా అవుతుంటాయి.అలా చేసి ఇప్పుడు హీరో గోపీచంద్ తీవ్రగాయాల పాలయ్యాడు.మరి ఆ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for GOPICHAND

గోపిచంద్ హీరోగా, తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, అనిల్ సుంకర నిర్మిస్తున్న సినిమా షూటింగ్ ప్రస్తుతం, ఇండియా, పాకిస్థాన్ బోర్డర్‌లో గల జైసల్మేర్ దగ్గర జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 32 కోట్ల భారీ బడ్జెట్‌తో గోపీ కెరీర్ లోనే అత్యంత పెద్ద బడ్జెట్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. గోపీచంద్‌కి జోడీగా ఈ సినిమాలో కత్రినాకి జిరాక్స్ లా ఉండే జరీన్ ఖాన్ నటిస్తోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. బైక్ పైనుంచి వెళ్లే స్టంట్స్ జరుగుతున్నాయి. ఈ సమయంలోనే గోపీచంద్ బైక్ పైనుంచి కింద పడ్డాడు. గాయాలు అయినట్లు తెలుస్తోంది. వెంటనే ఫస్ట్ ఎయిడ్ అందించి ఆస్పత్రికి తరలించారు. పెద్ద ప్రమాదం ఏమీ లేదని చిత్రయూనిట్ చెబుతోంది. గాయాలు చిన్నగాయాలే అని చిత్రయూనిట్ తెలిపింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అభిమానులు ఆందోళన చెందొద్దని చిత్రయూనిట్ తెలిపింది. ఈ రోజుతో అక్కడ చిత్రీకరణ ముగియాల్సి ఉండగా బైక్ చేజింగ్ సీన్స్ తీస్తున్న టైమ్ లో గోపీచంద్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి‌. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు చికిత్స చేయించుకున్న తర్వాత షూటింగ్ లో పాల్గొనవచ్చి అక్కడి ఫోర్టీస్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.వాస్తవానికి ఈరోజుతో అక్కడి షూటింగ్ పూర్తికానుంది. కానీ చివరి రోజునే ఇలా ప్రమాదానికి గురయ్యాడు. మరి గోపిచంద్ కు జరిగిన ఈ ప్రమాదం గురించి అలాగే సన్నివేశం కోసం హీరోలు ఇలా రిస్క్ లు తీసుకోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.