Breaking News : ‘ హ్యాపీ డేస్ ‘ దర్శకుడి కన్నుమూత.. షాక్ లో ఇండస్ట్రీ..

1135

ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ఉన్న ప్రముఖులు చనిపోవడమో లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చాలా మంది ప్రముఖులు ఈ మధ్య వరుసగా చనిపోతున్నారు. ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కన్నుమూశాడు.

ఈ క్రింది వీడియో చూడండి

హ్యాపీ డేస్ దర్శకుడు ఇక లేరు… మిగతా వాటికంటే తెరపై హాస్యరసాన్ని పండించడం, దాన్ని ప్రేక్షకులు కడుపారా నవ్వుతూ స్వీకరిచేలా చేయడం ఏ దర్శకుడికైనా కత్తిమీద సాము లాంటిదే. అలాంటి విద్యలో ఆరితేరి.. రొమాంటిక్ కామెడీ షోలు, సినిమాలతో అమెరికన్ టీవీ రంగాన్ని, హాలీవుడ్ ఇండస్ట్రీని ఓక ఊపు ఊపిన దర్శకుడు గ్యారీ మార్షల్ (81) ఇకలేరు. నిమోనియాతో బాధపడుతూ లాస్ ఏంజిల్స్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. హ్యారీకి భార్య బార్బరా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గ్యారీ మార్షల్ రూపొందించిన సిచ్యువేషనల్ కామెడీ (సిట్ కామ్) షో ‘హ్యాపీ డేస్’ 1974 నుంచి 1984 వరకు అమెరికా టీవీ రంగాన్ని ఊపేసింది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ప్రిటీ ఉమన్’ సినిమా 1990లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రంగా నిలించింది. జూలియా రాబర్ట్స్, రిచర్డ్ గేర్ లు ఆ సినిమాలో ప్రధాన పాత్రదారులు.

Image result for గ్యారీ మార్షల్

ఈ ఏడాది విడుదలైన ‘మదర్స్ డే’ నుంచి వెనక్కి వెళితే గ్యారీ దర్శకత్వం వహించిన ‘న్యూ ఇయర్స్ ఈవ్’, ‘వాలెంటైన్స్ డే’, ‘ది ప్రిన్సెస్ డైరీస్’, ‘బీచెస్’ లాంటి సినిమాలన్నీ రొమాంటిక్ కామెడీ జానర్ లో రూపొందినవే. ఇవేకాక 40 టీవీ షోలను రూపొందించారయన.న్యూయార్క్ లో పుట్టి పెరిగిన గ్యారీ మార్షల్.. జర్నలిజంలో డిగ్రీ చేశారు. ఓ పత్రికలో చేరి, సినిమా గాసిప్స్ రాసేవారు. అవి అద్భుతంగా పేలడంతో హాస్య నటుడు జాయ్ బిషప్.. గ్యారీని లాస్ ఏంజిల్స్ కు తీసుకెళ్లి తన టాక్ షో డైలాగ్ రైటర్ గా నియమించుకున్నారు. అక్కడి నుంచి గ్యారీ వెనుదిరిగి చూడలేదు. ది లూసీ షో, ది డిక్ వాన్ డైక్ షో, హాపీ డేస్ తదితర టీవీషోలు రూపొందించి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. గ్యారీ మృతిపట్ల పలువురు హాలీవుడ్ నటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.