Breaking News : దుబాయ్ లో ఈవెంట్ కు వెళ్లి ఆడవారితో అసభ్యంగా మాట్లాడి జైలు శిక్ష వేయించుకున్న టాప్ సింగర్..

404

బాలీవుడ్ ప్రముఖ సింగర్ లలో మికా సింగ్ ఒకరు. ఇతడు పలు భాంగ్రా, పాప్ మరియు సినీ గీతాలు పాడాడు. తెలుగులో మిర్చి సినిమాలో తన గళాన్ని వినిపించాడు. సుప్రసిద్ద పంజాబీ గాయకుడు దలేర్ మెహంది ఇతని పెద్దన్న. ప్రస్తుతం మికా సింగ్ ఒక వివాదంలో చిక్కుకున్నాడు.ఇంతకముందు ఒక ఒక మోడల్ ను లైంగికంగా వేధించాడు.అవకాశాలు ఇప్పిస్తా అని ఆమెను వాడుకోవాలనుకున్నాడు.దాంతో ఆమె అప్పట్లో కేసు వేసింది.అయితే ఇప్పుడు మరొకసారి అదే తప్పు చేసి అడ్డంగా దొరికిపోయాడు.మరి ఏమైందో తెలుసుకుందామా.

Image result for మికా సింగ్

బాలీవుడ్ ప్రముఖ గాయకుడు మికా సింగ్ కొన్ని రోజుల క్రితం ఒక బాలీవుడ్ ఈవెంట్ కోసం దుబాయి వెళ్లడం అక్కడ ఒక బ్రెజిల్ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం వంటి విషయాలు ముంబయి వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్న విషయం తెల్సిందే. మికా సింగ్ పై నమోదు అయిన కేసు చిన్నదే అని వెంటనే వచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కాని దుబాయిలో ఇలాంటి కేసులు చాలా సీరియస్ గా తీసుకుంటారు. దుబాయి కోర్టు ముందుకు వెళ్లిన మికా సింగ్ కేసు ను న్యామూర్తులు తీవ్రంగా పరిగణించారు.ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు దేశం పరువు పోయేలా మికా సింగ్ చర్య ఉందని కోర్టు అభిప్రాయపడింది.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించినట్లుగా మికా సింగ్ సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం మికా సింగ్ సన్నిహితులు ఆ బ్రెజిల్ లేడీ తో రాజీ కి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో ఆమె కు డబ్బు చెల్లించి అయినా మికా సింగ్ పై కేసు విత్ డ్రా చేయిస్తామని అతడి స్నేహితులు హామీ ఇస్తున్నారు.

ప్రస్తుతాని కి దుబాయి జైల్లో ఉన్న మికా సింగ్ కేసు నిరూపణ అయితే తీవ్రమైన శిక్ష ను అనుభవించాల్సి వస్తుందని అక్కడ న్యాయ నిపుణలు చెబుతున్నారు. దుబాయిలోని ఇండియన్ ఎంబసి కూడా ఈ విషయంపై అక్కడి ప్రభుత్వం తో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కోర్టులో కేసు ఉన్న కారణంగా అక్కడి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేమని చేతులు ఎత్తేసినట్లు గా చెబుతున్నారు. దాంతో మికా సింగ్ భవిష్యత్తు ఏంటా అంటూ ఆయన కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చూడాలి మరి ఏం జరుగుతుందో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.మికాసింగ్ గురించి అలాగే అతను మహిళతో అసభ్యంగా ప్రవర్తించి కేసులో ఇరుక్కోవడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.