Breaking News : స్టార్ హీరోయిన్ దారుణ హత్య.. శవానికి రాయి కట్టి చెరువులో పడేశారు!

374

ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ఉన్న ప్రముఖులు చనిపోవడమో లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చాలా మంది ప్రముఖులు ఈ మధ్య వరుసగా చనిపోతున్నారు. మొన్నటికి మొన్న దర్శకుడు కోడిరామకృష్ణ ఆ తర్వాత బెంగాలీ హాస్య బ్రహ్మ చిన్మయి రాయ్ కనుమూశారు. వాళ్ళ మరణాన్ని మరవకముందే ఇప్పుడు ఒక సినీ నటి కన్నుమూసింది.

Image result for ఆంచల్ యాదవ్

రాంచీకి చెందిన నటి, మోడల్ ఆంచల్ యాదవ్(32)ను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. అనంతరం శవానికి రాయి కట్టి గురూర్ ప్రాంతంలోని చెరువులో పడేశారు. చెరువులో తేలుతున్న శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు. అయితే, పోలీసులు ముందుగా ఆమెను గుర్తించలేకపోయారు. ఆమె ఫొటోతో పాటు, చేతిపై ఉన్న టాటూను సోషల్ మీడియాలో పెట్టి ఆమె ఆచూకీ తెలపాలని కోరారు. రాత్రి నుంచి తన కుమార్తె కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆంచల్ తల్లికి కూడా ఆ ఫొటోను చూపించారు. దీంతో అది తమ కుమార్తె శవమేనని ఆమె తెలిపింది.

ఈ క్రింది వీడియో చూడండి

సోమవారం దంతారీలోని తమ ఇంటి వచ్చిన ఆంచల్.. రాత్రి 9 గంటల సమయంలో ఇంటి బయట వేచి చూస్తున్న గుర్తు తెలియని బైకర్‌ను కలిసిందని, ఆ తర్వాత నుంచి ఆమె మళ్లీ కనిపించలేదని ఆంచల్ తల్లి తెలిపింది. అయితే, ఆంచల్‌ను ఎవరు హత్య చేశారనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు ఆమె సోషల్ మీడియా అకౌంట్లు, ఫోన్ కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. ఆమె కడుపులో కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయని, హత్య తర్వాత ఆమె శవం పైకి తేలకుండా రాయిని కట్టి చెరువులో పడేశారని పోలీసులు తెలిపారు. 2014లో లైఫ్ ఇన్సురెన్స్ ఏజెంట్‌గా పనిచేసిన ఆమె ఓ అటవీ శాఖ అధికారితో సన్నిహితంగా ఉండేది. అయితే, ఓ వివాదాస్పద వీడియోతో ఆమె ఆ అధికారిని బెదిరించిందనే ఆరోపణతో పోలీసులు ఆంచల్‌ను అరెస్టు చేశారు. అయితే, అతను తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని, తనని పెళ్లి చేసుకోవాలని అప్పట్లో ఆమె డిమాండు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ హత్యలో ఆ అధికారి ప్రమేయం ఏదైనా ఉందనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.ఈమె మరణవార్త తెలిసిన స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు.కొంతమంది సినీ ప్రముఖులు ఆమె ఇంటికి చేరుకొని నివాళి అర్పిస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.