Breaking Nwes : ప్రముఖ సింగర్ మృతి

476

ప్రేమే జీవితం అని అనుకునే వారు చాలా మంది ఉంటారు.. వారి ప్రేమ‌ను సాధించుకోలేక‌పోతే వారి జీవితం ముగిసిపోయింది అని అనుకుంటారు. ఎంతో వేధ‌న అనుభ‌విస్తారు. ఇక ల‌వ్ ఫెయిల్యూర్ యువత జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందనడానికి ఆ సంఘ‌ట‌న ఓ ఉదాహరణగా జ‌రిగింది . ప్రముఖ అమెరికన్ సింగర్ 26 ఏళ్ల మాక్ మిల్లర్ మృతి చెందాడు. ఈ యువ సింగర్ మరణానికి ప్రత్యక్షంగా డ్రగ్స్ కారణం అయితే, పరోక్షంగా లవ్ ఫెల్యూర్ కారణం అయింది. మంచి భవిష్యత్తు ఉన్న మాక్ మిల్లర్ జీవితం అర్ధాంత‌రంగా ముగిసిపోయింది..

 స్పృహ లేకుండా

సెప్టెంబర్ 7 ఉదయం మిల్లర్ తన నివాసంలో స్పృహ లేకుండా ఉండడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు..డ్రగ్స్ మితిమీరి తీసుకోవడం వలన మిల్లర్ కు గుండెపోటు వచ్చిందని, అందువలనే అతడు మరణించాడని వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా మిల్లర్ మానసిక ఆందోళనతో, ఒత్తిడితో కనిపిస్తున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

మితిమీరిన డ్రగ్స్

ప్రేమ విఫలం కావడం వలన మిల్లర్ జీవితం చిన్నాభిన్నమైంది. మిల్లర్ తన ప్రియురాలు అరియనా గ్రాండే ని 2012 లో కలుసుకున్నాడు. ఆమె కూడాసింగరే. వీరుఇద్దరూ కలసి చాలా స్టేజి షోలలో పాల్గొన్నారు. ప్రేమికులుగా మారిన వీరిద్దరూ 2017 వరకు డేటింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
అనుకోని కారణాల వలన మిల్లర్, గ్రాండే గత ఏడాది విడిపోయారు. అప్పటినుంచి మిల్లర్ డిప్రెషన్ లోకి వెళ్లి డ్రగ్స్ కు బానిసైనట్లు తెలుస్తోంది. పుండు మీద కారంలా మిల్లర్ హింట్ అండ్ రన్ కేసులో చిక్కుకున్నాడు. దీనితో అతడికి మానసిక ఒత్తిడి మరింతగా పెరిగింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇటీవల గ్రాండే అమెరికన్ నటుడు డేవిడ్సన్ తో నిశ్చితార్ధం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మిల్లర్ భరించలేకపోయాడు. డ్రగ్స్ విపరీతంగా వాడుతూ వాటికీ బానిసైపోయినట్లు తెలుస్తోంది. ఫలితంగానే గుండె పోటు వచ్చి తుదిశ్వాస విడిచాడు అని భావిస్తున్నారు.మిల్లర్ చివరగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా తన ప్రేమ విషయాన్ని ప్రస్తావించాడు. మాక్ మరణానికి గ్రాండే నే కారణం అంటూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదురవుతున్నాయి. గగ్రాండే మద్దత్తు దారులు కూడా మాక్ మరణానికి ఆమె ఎలా కారణం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. మ‌రి ప్రేమ చివ‌ర‌కు ఎటువంటి అల‌వాట్ల‌కు దారి తీసిందో చూడండి … అందుకే ప్రేమ విఫ‌లం అయితే వారు ఇటువంటి వాటికి దూరంగా ఉండండి.. ప్రేయ‌సి ఒక్క‌రే మీ జీవితం కాదు అనేది మ‌ర్చిపోకండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.