Breaking News : ప్రముఖ నిర్మాత మృతి.. తరలివస్తున్న సినీ ప్రముఖులు

205

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని ప్రముఖ సినీ ప్రముఖులు చనిపోతున్నారు. చాలా మంది సిని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. మొన్నటికి మొన్న నటుడు రాళ్ళపల్లి మరణించారు. ఇప్పుడు మరొక సినీ ప్రముఖుడి జీవితంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కన్నడ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు నిర్మించి, వందేళ్లకుపైగా జీవించిన వ్యక్తిగా వార్తల్లోకి ఎక్కిన జిఎన్ లక్ష్మీపతి ఇక లేరు. కన్నడ చిత్ర సీమలో పలు చిత్రాలు నిర్మించిన ఆయన గురువారం(మే 16) కన్నుమూశారు. లక్ష్మిపతి వయసు 104 సంవత్సరాలు.

ఈ క్రింది వీడియో చూడండి

కొంత కాలంగా వయసు సంబంధమైన సమస్యలతో బాధ పడుతున్నారు. కర్ణాటకలోని తుమ్మక్కురు జిల్లా గుబ్బిలో లక్ష్మీపతి జన్మించారు. కన్నడ నాటక రంగానికి మార్గదర్శకుడిగా కీర్తిగాంచిన గుబ్బి వీరన్న కుటుంబంతో లక్ష్మిపతి ఫ్యామిలీకి క్లోజ్ రిలేషన్ ఉంది. ఆయన నాటకాలు చూస్తూ పెరిగిన లక్ష్మీపతి సినిమా నిర్మాణంపై ఆసక్తి పెంచుకున్నారు. మారుతి మూవీస్ బేనర్లో పలు మెమొరబుల్ చిత్రాలు నిర్మించారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్, జయంతి నటించిన ‘దేవర మక్కలు’ చిత్రం ద్వారా జీఎన్ లక్ష్మీపతి నిర్మాతగా మారారు. తనకెరీర్లో మొత్తం 7 చిత్రాలు నిర్మించారు. ఎన్.లక్ష్మినారాయణ నటించిన ‘ఉయ్యాలే’, గిరీష్ కర్నాడ్, శంకర్ నాగ్ నటించిన ‘ఆనడనోండు కలాదల్లి’తో పాటు పలు కన్నడ చిత్రాలు నిర్మించారు.

Related image

జిఎన్ లక్ష్మీపతి నిర్మించిన చిత్రాలు పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శితం అయ్యాయి. కన్నడ చిత్రసీమకు ఆయన చేసిన సేవలకుగాను రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ విష్ణువర్దన్ అవార్డుతో సత్కరించింది. కన్నడ చిత్ర పరిశ్రమకు శంకర్ నాగ్, జ్ఞానపీఠ్ అవార్డ్ గ్రహీత గిరిష్ కర్నాడ్ లాంటి వారిని పరిచయం చేసిన ఘనత లక్ష్మీపతి సొంతం చేసుకున్నారు. ఆయన మరణం పట్ల కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంతాపం వ్యక్తం చేసింది. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.