Breaking News:ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత

279

టాలీవుడ్ లో ఎంతో పేరు సంపాదించిన ద‌ర్శ‌కుల్లో కోడి రామ‌కృష్ణ , ఆయ‌న పేరు తెలియ‌ని వారు ఉండ‌రు అద్బుత‌మైన చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు ఆయ‌న‌… నిన్న కోడి రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నిన్న ఉదయం ఆయన అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఆస్పత్రికి తరలించారు. కోడి రామకృష్ణ అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురైన వార్త టాలీవుడ్‌లో ప్రకంపనలు రేపింది అయితే 24 గంట‌లు గ‌డిచేస‌రికి ఆయ‌న ఆరోగ్యం బాగుంది అని అనుకున్నా నేడు ఆయ‌న తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయారు.

Image result for kodi ramakrishna

గతంలో పెరాలసిస్‌తో కొంత కాలం బాధ పడిన కోడి రామకృష్ణ.. ఆ తర్వాత కోలుకున్నారు. కాని ఇప్పుడు తీవ్ర అనారోగ్యంతో ఆయ‌న క‌న్నుమూశారు. విలక్షణ దర్శకుడైన కోడి రామకృష్ణ.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. వందకు పైగా చిత్రాలకు రామకృష్ణ దర్శకత్వం వహించారు…తెలుగుతో పాటు పలు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు కూడా ఆయన దర్శకత్వం వహించారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరితోనూ సినిమాలు చేశారు. 2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన చివరి సినిమా. తెరపై కుటుంబ కథా చిత్రాలను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ముందు వరసలో ఉంటారు.

ఈ క్రింది వీడియో చూడండి 

 

‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమాతో కోడి రామకృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. మధ్యతరగతి జీవితాలను.. అందులోని ఒడుదొడుకులను కథా వస్తువుగా ఎంచుకుని కోడి రామకృష్ణ సినిమాలను రూపొందించారు. తనదైన శైలిలో కథ చెప్పి ప్రేక్షకులను మెప్పించారు. ఫాంటసీ చిత్రాలను కూడా తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి సినిమాలే అందుకు ఉదాహరణ.మువ్వ గోపాలుడు, పెళ్లి, శత్రువు లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను కోడి రామకృష్ణ తెరకెక్కించారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరీర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్‌ని కొనసాగిస్తున్నారు. రామకృష్ణ మృతితో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయ‌న సొంత ఊరు ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లు ఆయ‌న మ‌ర‌ణించారు అని తెలియ‌డంతో పెద్ద ఎత్తున ఆయ‌న అభిమానులు మిత్రులు పాల‌కొల్లు నుంచి హైద‌రాబాద్ బ‌య‌లుదేరారు.