Breaking News : ప్రముఖ నటుడు మృతి షాక్ లో ఇండస్ట్రీ

472

బాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత ఖాదర్ ఖాన్ (81) తుది శ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కెనడాలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని ఆయన తనయుడు సర్ఫరాజ్ వెల్లడించారు. ‘‘నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. ఆయన కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు అందరూ కెనాడాలోనే ఉన్నాం. అంత్యక్రియలు ఇక్కడే నిర్వహిస్తాం’’ అని తెలిపారు సర్ఫరాజ్. ఖాదర్ 1937 అక్టోబరు 22న కాబూల్లో జన్మించారు. సివిల్ ఇంజినీర్గా కెరీర్ను ప్రారంభించిన ఆయన 1973లో రాజేష్ ఖన్నా నటించిన ‘దాగ్’తో వెండితెరకు పరిచయమై 300పైగా చిత్రాల్లో నటించారు. ‘జుద్వా’, ‘జుడాయి’, ‘సుహాగ్’, ‘ముజ్ సే షాదీ కరోగీ’, ‘లక్కీ: నో టైమ్ ఫర్ లవ్’ తదితర చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు బాలీవుడ్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

1980- 90ల్లో బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ప్రతి చిత్రంలోనూ ఖాదర్ ఏదో ఒక పాత్రలో నటించారు. మన్మోహన్ దేశాయ్, ప్రకాష్ మెహ్రాలతో కలసి రచయితగా ఎక్కువ చిత్రాలకు పనిచేశారు ఖాదర్. తాతినేని రామారావు, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు లాంటి ప్రముఖ తెలుగు దర్శకులు హిందీలో రూపొందించిన పలు చిత్రాల్లోనూ ఖాదర్ నటించారు. హాస్య ప్రధాన పాత్రలతో ప్రాచుర్యం పొందిన ఖాదర్… డేవిడ్ ధావన్ సినిమాల్లో గోవిందాతో కలసి నటించిన ‘దుల్హే రాజా’, ‘కూలీ నెం 1’, ‘బడే మియాన్ ఛోటే మియాన్’, ‘రాజా బాబు’ తదితర చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో అలరించారు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, అమితాబ్ బచ్చన్, ఫిరోజ్ఖాన్, అనిల్కపూర్, గోవిందా తదితరులతో కలసి పలు చిత్రాల్లో నటించారాయన. ‘పర్వారిష్’, ‘దాన్ దౌలత్’, ‘లూట్ మార్’, ‘ఖుర్బానీ’, ‘సనమ్ తేరీ కసమ్’ తదితర చిత్రాల్లో ప్రతి నాయకుడిగానూ నటించారు ఖాదర్. పలు కామెడీ టీవీ సిరీస్ల్లోనూ ఖాదర్ నటించారు. 2017లో వచ్చిన ‘మస్తీ నహీ సస్తీ’ ఖాదర్ నటించిన చివరి చిత్రం. ఖాదర్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమితాబ్ బచ్చన్ ట్విటర్లో తమ సంతాపం తెలిపారు.మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.