Breaking News గుండెపోటుతో ప్రముఖ నటుడు మృతి

484

తెనాలికి చెందిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పగడాల శ్యాం సుందరరావు బుధవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయ‌న వ‌యసు 68 సంవ‌త్స‌రాలు కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన సోమవారం అస్వస్థతకు లోనుకావడంతో వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్సపొందుతూ మృతి చెందాడు. చిన్నతనం నుంచే నాటక రంగంపై మక్కువతో రంగస్థలంపై పలు పాత్రలను పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారు. కో-ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే కళాకారుడిగా ప్రతిభను నిరూపించుకున్నారు. సినీ, టీవీ రంగంలో పాత్రలు ధరిస్తూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇక ఆయన ఉద్యోగ ధ‌ర్మం అలాగే త‌న‌కున‌చ్చిన క‌ళ‌తో ఇప్ప‌టి వ‌ర‌కూ ఎంతో పేరు సంపాదించుకున్నారు ఆయ‌న‌కు ప‌లువురు పెద్ద‌ల‌తో కూడా మంచి స‌త్సంబంధాలు ఉన్నాయి.

ఈ క్రింది వీడియో చూడండి

ఆయన మృతి పట్ల పట్టణానికి చెందిన పలు సాంస్కృతిక, నాటక సమాజాలు సంతాపం తెలిపాయి. అభ్యుదయ కళా సమితి వ్యవస్థాపకులు బొల్లిముంత కృష్ణ, చెరుకుమల్లి సింగారావు, దేవిశెట్టి కృష్ణారావు, కన్నె గంటి మధు, ఆరా ధ్యుల వెంకటేశ్వరరావు, నాగళ్ల వెంకటదుర్గాప్రసాద్‌, పట్టణ కళాకారుల సంఘం అధ్యక్షుడు జానీబాషా, సత్యనారాయణశెట్టి, ఇస్కఫ్‌ కార్యదర్శి హనుమంతరావు తదితరులు సంతాపం తెలిపారు. ఆయ‌న సాంస్కృతిక క‌ళా వైభ‌వం ప‌ట్ల ఎంతో బాగా చెప్పేవార‌ని క‌ళ‌ల‌ను ఆయ‌న ఎంతో ఇష్ట‌ప‌డేవార‌ని అలాగే క‌ళాకారుల‌ను ఎంద‌రినో ద‌గ్గ‌రకు చేర్చుకుని సాయం చేశారు అనిచెబుతారు ఇక రంగ‌స్ధ‌లంలో ఆయ‌న చేసిన అనేక పాత్ర‌లు ఆయ‌న‌కుమంచి పేరు తెచ్చిపెట్టాయి.. సినీ, టీవీ రంగంలో పాత్రలు ధరిస్తూ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. ఎప్పుడు ఎలాంటి షూటింగ్ ఉన్నా ఆయ‌న పాల్గొనేవారు. ఆయ‌న మృతిప‌ట్ల సంతాపం తెలియ‌చేశారు సినీ టీవీ ఆర్టిస్టులు, ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాలి అని మ‌నం కూడా కోరుకుందాం.