Breaking News : ఈగ ఫేం సుదీప్ అరెస్టు.. ఏమైందో తెలిస్తే షాక్..

211

కొంతమంది సెలెబ్రిటీల జీవితం చెప్పుకునేంతలా ఏమి ఉండదు.తెరమీద మాత్రం హీరోల వేషాలు వేస్తారు బయటమాత్రం వాళ్ళు వేసే వేషాలు అన్నీఇన్నీ కావు.సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు నిజజీవితంలో చేసే కొన్ని పనులు వారి పరువుకు భంగం కలిగిస్తుంటాయి.నీతులు చెప్పాల్సిన వాళ్ళు నీతిమాలిన పని చేసి ఉన్న పరువును పోగొట్టుకుంటారు.ఇలా చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు.ఇప్పుడు ఒక ప్రముఖ నటుడు కూడా అదే పని చేశాడు.చివరికి అరెస్ట్ అయ్యాడు.మరి ఆయనెవరో ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ బహుబాష నటుడు, ఎస్ఎస్ రాజమౌళి ఈగ ఫేమ్ కిచ్చ సుదీప్ కు అరెస్టు వారెంట్ జారి అయ్యింది. కోర్టు విచారణకు హాజరుకాకుండా కాలం గడుపుతున్న సుదీప్ కు కర్ణాటకలోని చిక్కమగళూరు జేఎంఎఫ్ సీ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ అయ్యింది.చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూర్ అనే వ్యాపారి హీరో సుదీప్ మీద ఫిర్యాదు చెయ్యడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. సుదీప్ ఒక ప్రైవేట్ కంపెనీలో వారస్ధారా అనే సీరియల్ నిర్మించారు. ఈ టీవీ సీరియల్ షూటింగ్ కోసం సుదీప్ చిక్కమగళూరులోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. కిచ్చ క్రియేషన్స్ నిర్మించిన ఈ సీరియల్ షూటింగ్ కోసం సుదీప్ చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూరు అనే వ్యక్తికి చెందిన ఇల్లు, కాఫీ తోటను అద్దెకు తీసుకున్నారు. షూటింగ్ సమయంలో ఇల్లు, ఫాం హౌస్ ద్వంసం అయ్యిందని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు.

Image result for sudeEp

ఇల్లు, కాఫీ తోట దెబ్బతినిందని, నష్ట ఫరిహారంగా రూ. 1.50 కోట్లు చెల్లించాలని సుదీప్ కు ఎన్నిసార్లు మనవి చేసినా ఆయన పట్టించుకోలేదని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు. నష్ట పరిహారం చెల్లించాలని తాను చేసిన మనవిని కిచ్చి క్రియేషన్ తిరస్కరించిందని, అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించానని దీపక్ మయూర్ తెలిపారు. ఆ నష్టపరిహారం కడితే ఎలాంటి సమస్య ఉండదు కానీ కట్టకపోతే మాత్రం అరెస్ట్ చెయ్యనున్నారు. చూడాలి మరి కడతాడో లేక జైలుకు వెళతాడో. సుదీప్ కు ఒక్క కన్నడ ఇండస్ట్రీలోనే కాదు మొత్తం దక్షిణాది మొత్తం ఫాన్స్ ఉన్నారు. సుదీప్ నటించిన కొన్ని సినిమాలు తెలుగులో విడుదల అయ్యి మంచి హిట్ అయ్యాయి.మరి సుదీప్ గురించి అలాగే ఆయనకు అరెస్ట్ వారెంట్ రావడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.