BREAKING NEWS :రాధిక, శరత్ కుమార్లు అరెస్ట్.. కోర్టు సంచలన తీర్పు

468

తమిళ నటులు, భార్యభార్తలైన రాధిక, శరత్కుమార్ న్యాయ పరమైన చిక్కుల్లో పడ్డారు. చెక్ బౌన్స్ కేసులో వీరికి అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ మేరకు చెన్నైలోని సైదాపేట కోర్టు ఆదేశాలు జారీచేసింది. వీరితో పాటు నిర్మాత లిస్టిన్ స్టీఫెన్కు కూడా ఇందుకు సంబంధించిన నోటీసులు అందుకున్నారు. చెక్ బౌన్స్ కేసులో ఈ ముగ్గురు జూన్ 28న సైదాపేట్ కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా… రాలేదు. దీంతో వారిపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణ వచ్చే నెల జులై 12వ తేదీకి వాయిదా వేశారు.

Court Order That Arrest Radhika And Sarathkumar In Check Bounce Case - Sakshi

నటి రాధిక ఆమె భర్త తమిళ హీరో శరత్ కుమార్ లను అరెస్టు చేయమని కోర్టు పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అందరూ ఒక్కసారిగా తమిళ పరిశ్రమలో షాక్ అయ్యారు. …. తమిళ హీరో శరత్ కుమార్, అతని భార్య, నటి, నిర్మాత రాధికా శరత్ కుమార్ , మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్ లు రెడియన్స్ మీడియా సంస్ధకు బాకీ పడిన రూ. 2కోట్లు ఇవ్వకపోవడంతో చెన్నై లోని సైదాపేట కోర్టు వారిని అరెస్టు చేయమని ఆదేశాలిచ్చింది.

Arrest Warrant against Tamil stars Radhika and Sarathkumar

రాధికా, శరత్ కుమార్, లిస్టిన్ స్టీఫెన్ లు కలిసి గతంలో కొన్ని సినిమాలు నిర్మించారు. ఆ సమయంలో రేడియన్స్ మీడియా సంస్ధనుంచి తీసుకున్న అప్పు రూ.2 కోట్లకు గానూ చెక్కును ఇచ్చారు. కాగా… ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో రేడియన్స్ మీడియా సంస్ధ రాధికా, శరత్ కుమార్, లిస్టింగ్ స్టీఫెన్ లపై చెన్నై సైదాపేట కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.తమకు రావాల్సిన డబ్బు ఇవ్వకుండా ఈ ముగ్గురు ఇబ్బంది పెడుతున్నారని, తమకు రావాల్సిన మొత్తం దక్కేలా న్యాయం చేయాలని రేడియన్స్ మీడియా సంస్థ కోర్టుకు విన్నవించింది. ఈ ముగ్గురుపై అరెస్ట్ వారెంట్ జారీ అవ్వడం తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో చర్చనీయాంశం అయింది.

ఈ క్రింది వీడియో చూడండి

ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రాధిక, శరత్ కుమార్, లిస్టింగ్ స్టీఫెన్ లు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి వీరిని అరెస్టు చేయాలని ఆదేశించారు,. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 12 కి వాయిదా వేశారు, దక్షిణాదిన పలు భాషా చిత్రాల్లో నటించిన రాధిక పలు టీవి సీరియల్స్ కూడా నిర్నించారు.రాధిక హీరోయిన్ గా సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నసమయంలో రాడాన్ మీడియా సంస్ధను స్ధాపించి టీవీ సీరియల్స్ నిర్మాణం ప్రారంభించారు. ఆమె నిర్మించిన సీరియల్స్ తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో అత్యంత ప్రజాదరణ పొందాయి. రాధిక నిర్మించిన సీరియల్స్ ఎక్కువగా సన్ నెట్ వర్క్ లో ప్రసారం అవుతూ ఉంటాయి. రాడాన్ మీడియా సంస్ధ తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు కూడా నిర్మించింది.