Breaking News : సినీ దిగ్గజం, హాస్య బ్రహ్మ కన్నుమూత.. షాక్ లో ఇండస్ట్రీ..

1872

ప్రముఖుల ఇళ్లలో వరుస విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. అటు సినీ రంగం నుంచి ఇటు రాజకీయ రంగం నుంచి ఉన్న ప్రముఖులు చనిపోవడమో లేదా వారి కుటుంబ సభ్యులు చనిపోవడమో జరుగుతుంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకుంటున్నాయి. చాలా మంది ప్రముఖులు ఈ మధ్య వరుసగా చనిపోతున్నారు. ఇప్పుడు ఒక సినీ దిగ్గజం కన్నుమూశాడు.

Image result for చిన్మయి రాయ్‌

ప్రముఖ బెంగాలీ హాస్యనటుడు చిన్మయి రాయ్‌ (79) గుండెనొప్పితో ఆదివారం రాత్రి ఆయన స్వగృహంలో మృతిచెందారని కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొంతకాలం క్రితం ఆయన భార్య, నటి అయిన జ్యురు బెనర్జీ కొన్నేళ్ల క్రితమే మృతిచెందారు. ప్రస్తుతం బాంగ్లాదేశ్ పరిధిలోకి వచ్చే కొమిల్లా జిల్లాలో 1940 జనవరి 16 న జన్మించారు. 60 వ దశాబ్దంలో ఆయన తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. ఎన్నో రకాల హాస్య పాత్రలు చేసి బెంగాలీ ప్రజలను మెప్పించాడు. ఒకానొక సమయంలో ప్రతి చిత్రంలో ఇతని పాత్ర ఉండాల్సిందే. ఆయన లేకపోతే సినిమా ప్లాప్ అనే స్టేజ్ కు వచ్చింది. ఆయన నటించిన చిత్రాలు చూస్తే ఇతను పాత్రలో నటిస్తున్నాడా లేదా అన్నట్టు ఉండేది. అంత అద్భుతంగా పాత్రలో ఒదిగిపోయేవాడు.

ఈ క్రింది వీడియో చూడండి 

అలాంటి సినీ దిగ్గజం ఇప్పుడు లేడు అంటే బెంగాలీ చిత్ర పరిశ్రమ దిగ్బంతికి లోనవుతుంది. ఈయన మరణం బెంగాలీ చిత్ర పరిశ్రమకు తీరని లోటని చెప్పుకోవాలి.’బసంతా బిలాప్‌’ అనే సినిమాలో టెండ్యా పాత్ర ద్వారా, ‘మౌచాక్ , ‘గల్పో హోలో సొటి’ వంటి చిత్రాలలో చిన్మయి రాయ్ నటన అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసింది. ఈయన మృతి పట్ల పలువురు సంతాపం ప్రకటిస్తున్నారు. బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ ట్వీట్‌ చేసి నివాళి అర్పించారు.. రారు శక్తివంతమైన నటుడని, పరిశ్రమ ఆయన నటనను పూర్తిగా ఉపయోగించుకోలేదని సహనటి సౌమిత్రా చటర్జీ అన్నారు.మనం కూడా ఆయనకు కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.