Breaking News : క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు మ‌ృతి

580

సినీ పరిశ్రమలో ఈ మధ్య విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.చాలా మంది ప్రముఖులు చనిపోయారు.రోడ్డు ప్రమాదాలు జరిగి కొందరు చనిపోతుంటే ఆరోగ్యం బాగాలేక కొందరు చనిపోతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ అనే మహమ్మారి సినీ సెలెబ్రిటీల జీవితాలతో ఆడుకుంటుంది. సోనాలి బింద్రే, రణబీర్ కపూర్ తండ్రి, హృతిక్ రోషన్ తండ్రి… ఇలా చాలా మంది సెలెబ్రిటీలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. కొందరు ట్రీట్ మెంట్ చేసుకుని బతికితే మరికొందరు చనిపోతున్నారు. అలా క్యాన్సర్ భూతానికి ఇప్పుడు ఒక నటుడు చనిపోయాడు.

Image result for రమేష్ భాట్కర్

మరాఠీ, హిందీ సినిమాల నటుడు రమేష్ భాట్కర్ క్యాన్సర్‌తో మృతి చెందారు. క్యాన్సర్ డే నాడే రమేష్ కన్నుమూయడం విషాదకరం. ఆయన పలు చిత్రాలలో పోలీసు అధికారిగా నటించారు. ఆయన వయసు 70 ఏళ్లు. ముంబైలోని ఎలిజబెత్ ఆసుపత్రిలో క్యాన్సర్ నివారణకు చికిత్స పొందుతూ రమేష్ భాట్కర్ తుది శ్వాస విడిచారు. గత 15 రోజులుగా ఆయన ఐసియు లోనే ఉన్నాడు. 1949 ఆగస్టు 3 న ఆయన కళాకారుల కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి వాసుదేవ్ భాట్కర్ గాయకునిగా పేరొందారు. 1977లో చిత్రరంగంలో కాలుమోపిన రమేష్ 30 ఏళ్లుగా నటిస్తూ వచ్చారు. దాదాపు 50 సినెమాలో నటించాడు. కొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించాడు. కానీ అవి చాలా చిన్న పాత్రలు కావడంతో ఆయన తెలుగు ప్రజలకు అంతలా తెలీదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

తెలుగులో కూడా పోలీస్ క్యారెక్టర్స్ లోనే నటించాడు. ఈయనకు టాలీవుడ్ లో అనేకమందితో సంబంధాలు ఉన్నాయి. ఇటీవల రమేష్ అనుపమ్ ఖేర్ నటించిన ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్ పాత్ర పోషించారు.ఆయన మరణవార్త విన్న మరాఠీ సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయన కుటుంబాన్న్ని పరామర్శించేందుకు ఇంటికి చేరుకుంటున్నారు.కొందరు సోషల్ మీడియా ద్వారా నివాళి అర్పించారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.