బ్రేకింగ్ న్యూస్: బండ్ల గణేష్ కు ఏమైంది..? టెన్షన్ లో కాంగ్రెస్ పార్టీ

442

రాజకీయ నేతగా మారిన సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన బండ్ల గణేష్ తనదైన శైలిలో పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. తాజాగా ఓ టెలివిజన్ ఛానెల్లో బ్లేడ్‌తో కోసుకొని ఆత్మహత్య చేసుకొంటానని ఓ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.

Image result for bandla ganesh
బండ్ల గణేష్ ప్రవర్తనపై అంద‌రూ మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బండ్ల గణేష్ ప్రవర్తన చాలా చిత్రంగా ఉంది. తెలంగాణలో మహాకూటమి పరాజయం పాలైతే గొంతు కోసుకొంటాననడం సరికాదు. పాలిటిక్స్‌లో ఆవేశంగా నిర్ణయాలు, సవాళ్లు చేయవద్దు అని పార్టీ నేత‌లు సినిమా జ‌నాలు అంటున్నారు. బ్లండ గణేష్ చేసిన సవాల్‌ను పోలీసుల దృష్టికి తీసుకురావాలి. ఆయనను కాపాడమని పోలీసులకు చెప్పాలి. ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకోవాలి అని చెబుతున్నారు ఆరోగ్యకరమైన సవాళ్లు ఉండాలని, ప్రాణాల మీదకు తీసుకొనే విధంగా ఉండకూడదు అని బండ్ల గ‌ణేష్ కు హిత‌వు ప‌లుకుతున్నారు జ‌నం.

Related image

ఇక బండ్ల గ‌ణేష్ గురించి తాజాగా ఓ విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.. ఆయ‌న ఇటీవ‌ల మీడియా ఛాన‌ల్ లో ఇంట‌ర్వూ ఇస్తు తాను మ‌హాకూట‌మి కాంగ్రెస్ గెల‌వ‌క‌పోతే చ‌నిపోతాను ..బ్లేడ్ తో కోసుకుంటాను అని స‌వాల్ చేశారు అయితే ఆ స‌మ‌యంలో ఆయ‌న ఇప్పుడు కోసుకోమ‌న్నా కోసుకుంటాను అని ఛాలెంజ్ చేసే సరికి, ఛాన‌ల్ లో ఉన్న సీనియ‌ర్లు హెడ్ లు ఆయ‌న నిలువ‌రించార‌ట.. ఇక ఆయ‌న ఇలాంటి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు అనే విష‌యం బ‌య‌ట‌కు రాలేదు అని తెలుస్తోంది. పోలీసులను కూడా తెలంగాణ రిజ‌ల్ట్ రోజు బండ్ల గ‌ణేష్ ని నిలువ‌రించాలి అని, ఆయ‌న‌కు ర‌క్ష‌ణ‌గా ఉండాలి అని చాలా మంది ఇప్ప‌టికే కోరుతున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అలాగే సీట్లు ఇవ్వ‌డానికి ముందు ఓ టెలివిజన్ చానెల్లో ప్రమాణం చేసి అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు. చివరకు సీటు రాకపోవడంతో మీడియాలో అభాసుపాలయ్యాడు… ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ పై అభిమానంతో పార్టీలో చేరిన బండ్ల‌కు అవ‌కాశం రావ‌క‌పోవ‌డం పై కొంద‌రు ఆయ‌న ఆశ‌లు నెర‌వేర‌లేదు అని. ఇలాంటి ఆత్మ‌హ‌త్య కామెంట్ల‌ను వెన‌క్కి తీసుకోవాలి అని అంటున్నారు జ‌నం.. మీరు కూడా ఈ విష‌యం పై మీ కామెంట్ల‌ను తెలియ‌చేయండి.