Breaking News: ఇక సెలవు

644

నందమూరి బాలకృష్ణ… పరిచయం అక్కర్లేని పేరు. ఎన్టీఆర్ వారసుడిగా వచ్చి తనకంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరచుకున్నాడు. అయితే ఇప్పుడు బాలకృష్ణ సంచలన నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సినీ వర్గాలు అంటున్నాయి. అదేంటని అనుకుంటున్నారా..ఇక సినిమాలకు బాలయ గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారంటా? జీవితంలో అటు వైపు వెళ్లకూడదని నిశ్చయించుకున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ బాలయ్య ఏ విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అనే డౌట్ వచ్చింది కదూ. నటన విషయంలో అయితే కాదులెండి. బాలయ్య ఇలా డిసైడ్ అయ్యింది నిర్మాణ రంగం విషయంలో.ఇటీవలే బాలయ్య నిర్మాణ రంగంలో అడుగుపెట్టి నిర్మాతగా మారి సంగతి తెలిసిందే. తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌ నిర్మించాలన్న ఆలోచన రాగానే ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో తాను నిర్మాతగా మారితే బాగుంటుందని భావించారు. అందుకే ఎన్బీకే ఫిలింస్‌ బ్యానర్‌ను స్థాపించి ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు భాగాలుగా నిర్మించారు. అయితే ఈ రెండు సినిమాలకు దారుణమైన ఫలితాలు వచ్చాయి. భారీగా నష్టాలు చూశారు. దీంతో బాలయ్య ఆలోచనలో పడ్డారట. నిర్మాణ రంగంలో కొనసాగటంపై అనాసక్తి చూపుతున్నారట.

Image result for balakrishna

‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమాకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. మొత్తంగా రూ.5 కోట్లను వసూలు చేయలేక చేతులేత్తేసింది. ఊహించని విధంగా అత్యంత దారణమైన డిజాస్టర్‌ను సొంతం చేసుకుంది. మొదటి పార్ట్‌తో 50 శాతం నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్‌..రెండో పార్ట్ మహానాయకుడుతో నిండా మునిగిపోయారు. దీంతో ఈసినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.మరోవైపు బాలయ్య..తన తండ్రి బయోపిక్‌తో నిర్మాత అవ్వాలనుకొని ఎన్బీకే ఫిల్మ్స్‌ను స్థాపించి తన కలను నెరవేర్చుకున్నారు. గతంలో బాలయ్య కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించినా.. నిర్మాతగా ఏ సినిమా నిర్మించలేదు. మరోవైపు వాళ్ల ఓన్ బ్యానర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉన్న దానికి ఒకప్పుడు హరికృష్ణ, ఆ తర్వాత రామకృష్ణ నిర్మాతలుగా వ్యవహరించారు. అప్పట్లో బాలయ్య కూడా సొంతంగా సినిమాలు నిర్మించడానికి తన కొడుకు, కూతుళ్ల పేర్లు కలిసేచ్చేటట్టు బ్రహ్మతేజ క్రియేషన్స్ బ్యానర్‌ను స్థాపించి సంస్థను రిజిస్టర్ చేయించాడు. ఆ తర్వాత తన జాతక రీత్యా సినిమా రంగం కలిసి రాదని తెలుసుకొని సినిమాలు నిర్మించలేదు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు తన తండ్రి బయోపిక్‌తో ఫస్ట్ టైమ్ నిర్మాత అవతారం ఎత్తాడు. తన జీవితంతో వెండితెరపై చరిత్ర సృష్టించాలనకున్న బాలకృష్ణ..ఈ రెండు సినిమాలతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ప్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా ఫలితం బాలయ్యను బాగా నిరాశపరిచింది. నిర్మాతగా తొలి అడుగులోనే ఊహించని పరాజయం ఎదురవ్వడంతో బాలయ్య ఎన్.బి.కే ఫిల్మ్స్ కార్యక్రమాలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.ఇప్పట్లో ఆయన నుంచి ఏ సినిమా రాకపోవచ్చని టాక్. మరోవైపు బోయపాటి శ్రీను సినిమా కోసం తానే నిర్మాతగా వ్యవహరించాలనుకున్నాడు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ ఫలితంతో బోయపాటి శ్రీను సినిమాను వేరే నిర్మాతలతో చేయాలని ఫిక్స్ అయినట్టు సమాచారం. తొలి ప్రయత్నమే తేడా కొట్టడంతో ఇక నిర్మాతగా కొనసాగకపోవటమే బెటర్‌ అన్న ఆలోచనలో బాలయ్య ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటారా..? లేదా అన్న దానిపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదరుచూడాల్సిందే.మరి మీరేమంటారు. బాలయ్య సినిమాలు తీస్తే మంచిదా.లేదా..సినెమాలు మానేయాలని అనుకుంటున్న బాలయ్య నిర్ణయం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.