Breaking News: టాప్ హీరోయిన్ పై మందుబాబుల దాడి

246

ప్రముఖ హిందీ బుల్లితెర నటి చాహత్ ఖన్నాకు హోలీ రోజు అత్యంత్య భయంకరమైన అనుభవాన్ని మిగిల్చింది. మీడియా సమాచారం ప్రకారం చాహత్ ఖన్నా కారుపై 10-15 మంది మందుబాబులు దాడి చేశారు. ఈ ఘటన ముంబైలోని మలాడ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సదరు మందుబాబులు నటీమణి కారు డ్రైవర్ ను కొట్టి, కారు అద్దాలను కూడా పగల గొట్టేశారు. చాహత్ ఖన్నా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమయంలో ఆమెకు సాయమందించడానికి అక్కడ ఎవరూ లేకపోయినా… చాహత్ ధైర్యం చేసి కారులోంచి దిగి చెప్పులతో ఆ మందుబాబులు కొట్టి అక్కడి నుంచి తరిమేశారు. ఈ ఘటనపై భావోద్వేగానికి లోనైన చాహత్ సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ పెట్టారు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. ఆ మందుబాబులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. చాహత్ ఖన్నా బుల్లితెర నటిగా బిజీగా గడుపుతోంది. ఆమె పలు టివి షోలు, సీరియల్స్ లో నటిస్తూ రాణిస్తోంది. కొన్ని చిత్రాల్లో కూడా అవకాశాలు అందుకుంది.

ఈ క్రింది వీడియో చూడండి

ఇక చాహత్ ఖన్నా ఫామిలీ విషయానికి వస్తే ఆమె ఈ మధ్యనే విడాకులకు అప్లై చేసింది.32 ఏళ్ల ఈ నటి 2013లో ఫరాన్ మీర్జాని రెండవ వివాహం చేసుకుంది. ఏ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఇటీవల వీరి వైవాహిక జీవితంలో విభేదాలు తలెత్తడం, భర్త నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంది. ఇప్పటికే తన భర్త నుంచి విడిపోయిన చాహత్ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది. తన భర్త ఎంత సైకోనో వివరించింది. ఓ సందర్భంలో తనకు ఎదలో విపరీతమైన నొప్పి కలిగింది. ఆసుపత్రికి తీసుకెళ్లమని ప్రాధేయపడ్డా. కానీ అతడు చెప్పిన సమాధానం మానసికంగా హింసించాడు. నీకు ఎద నొప్పిగా ఉంటే ఇప్పుడు నాతో శృంగారం చేయి.. అప్పుడు నమ్ముతా అంటూ సైకోలా ప్రవర్తించాడని చాహత్ ఖన్నా పేర్కొంది.

Image result for చాహత్ ఖన్నా

అతడి సైకో ప్రవర్తనతో చిత్రహింసలు అనుభవించా. నేను మరణించినా అతడు పట్టించుకోడని అర్థం అయింది. కేవలం లైంగిక హింస మాత్రమే కాదు, మానసికంగా, ఆర్థికంగా కూడా వేధించేవాడు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నా.. అతడొక అనుమానపు పక్షి. రాను రాను తన భర్త అనుమానాలు తారాస్థాయికి చేరాయి. చివరకు తన సహనటుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నానని వేధించేవాడు. ఇంట్లో వాతావరణం నాకు పిచ్చెక్కేలా చేసేది. తాను నటిస్తున్న టివి సీరియల్ సెట్స్ లోకి అకస్మాత్తుగా వచ్చేవాడు. అక్కడ గందరగోళం సృష్టించేవాడు. సెట్స్ లో సహనటులతో మాట్లాడినా, హగ్ చేసుకున్నా, కనీసం చేయి కలిపినా వాళ్ళతో నీకు ఏంటి సంబంధం అని వేధించేవాడు. చివరకు పిల్లలపై కూడా అనుమానం వ్యక్తం చేసేవాడని, అసలు వీళ్లు నాకు పుట్టిన పిల్లలేనా అని అనుమానం వ్యక్తం చేయడంతో తాను దాదాపుగా చనిపోయినంత పని అయింది. గొడవ జరిగే సమయంలో పశువులా మీద పడి కొట్టేవాడని అందుకే విడాకులు తీసుకుంటున్న అని ఆమె చెప్పింది.మరి చాహత్ ఖన్నా గురించి ఆమె భర్త నుంచి ఎదుర్కొన్న సమస్యల గురించి ఇప్పుడు మందుబాబులు ఆమె మీద దాడి చేసిన ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.