Breaking News:అమితాబ్ ఆరోగ్య పరిస్థితి విషమం..షాక్ లో సినీపరిశ్రమ

263

బాలీవుడ్ అగ్ర హీరో అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఓ పక్క సినిమాలు మరోపక్క ప్రకటనల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఎంత ఎత్తుకు ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయనది. ముఖ్యంగా అభిమానులు అంటే ఆయనకు చాలా ఇష్టం. వారంలో ఒకరోజు ఖచ్చితంగా అభిమానులను కలుసుకుంటుంటాడు అమితాబ్. ప్రతి ఆదివారం అమితాబ్ బచ్చన్ నివాసం జల్సా సందడిగా ఉంటుంది. ముంబై జుహు ప్రాంతంలో ఉన్న ఈ ఇంటికి పలువురు ఫ్యాన్స్ తమ అభిమాన నటుడి దర్శనం కోసం వస్తుంటారు. బిగ్ బి సైతం వారిని ఉత్సాహ పరుస్తూ బయటకు వచ్చి అందరి కలుస్తారు. గత 36ఏళ్లుగా జల్సా వద్ద అభిమానుల జాతర కొనసాగుతోంది.

Image result for amitabh bachan

అయితే గడిచిన ఆదివారం జల్సా వద్దకు వచ్చిన అభిమానులకు నిరాశే మిగిలింది. అమితాబ్ కనిపించక పోవడంతో అందరూ నిరాశగా వెనుదిరిగారు. బయటకు వచ్చి అభిమానులను పలకరించలేని స్థితిలో అమితాబ్ ఉండటమే ఇందుకు కారణం.‘‘ఈ రోజు సండే దర్శన్‌కు రావడం లేదు. అనారోగ్యం కారణంగా బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో ఉన్నాను. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నాను. ఈ విషయం అందరికీ చెప్పండి’ అంటూ అమితాబ్ బచ్చన్ తన సోషల్ మీడియా పేజీ ద్వారా అభిమానులకు ముందుగానే సందేశం పంపారు. అయితే అమితాబ్ నుంచి ఈ మెసేజ్ రాగానే చాలా మంది అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు.

ఈ క్రింది వీడియో చూడండి

ఎవరూ తన ఆరోగ్యం గురించి కంగారు పడకుండా స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు బిగ్ బి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, నొప్పి వల్ల బయటకు రాలేక పోతున్నాను, అంతకు మించి ఏమీ లేదని స్పష్టం చేశారు. 1982లో కూలీ షూటింగ్ సందర్భంగా అమితాబ్ తీవ్ర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మృత్యువుతో పోరాడి విజయం సాధించారు. అయితే అప్పటి ఎఫెక్ట్ ఆయన్ను తరచూ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ క్రమంలో 2005, 2012లో కడుపులో సర్జరీలు జరిగాయి. గతేడాది కూడా ఆయన ఆసుపత్రిలో గడిపారు. తాజాగా మరోసారి కడుపునొప్పి తిరగబెట్టినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్ వయసు ప్రస్తుతం 76 సంవత్సరాలు. తరచూ అనారోగ్యం వేధిస్తున్నా, వయసు సంబంధమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ నటుడిగా ఆయన అలుపెరుగని ప్రయాణం సాగిస్తున్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘బద్లా’ చిత్రం విజయం అందుకుంది. దీంతో పాటు బ్రహ్మాస్త్ర, సైరా నరసింహారెడ్డి, తేరా యార్ హో మే, లక్ష్మీ బాంబ్, ఝండ్ అనే చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి ఇంకా మంచి మంచి చిత్రాలలో నటించి మన అందరిని అలరించాలని కోరుకుందాం. మరి అమితాబ్ బచ్చన్ గురించి ఆయన అనారోగ్యానికి గురికావడం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.