Breaking News:అల్లుఅర‌వింద్ అరెస్ట్ షాక్ లో మెగా ఫ్యామిలీ

361

తెలుగు ఇండ‌స్ట్రీలో ప్ర‌ముఖ నిర్మాత‌ల్లో ఒకరు అల్లు అర‌వింద్. ఆయ‌న‌కు రెండు నిర్మాణ సంస్థ‌లున్నాయి. ఒక‌టి పెద్ద సినిమాల కోస‌మైతే.. మ‌రోటి చిన్న సినిమాల కోసం. గీతా ఆర్ట్స్ 2లో కూడా వ‌చ్చే సినిమాల‌కు కూడా అల్లు అర‌వింద్ ఆశీస్సులు ఉంటాయి. కానీ నిర్మాత‌గా మాత్రం బ‌న్నీ వాస్, ఎస్‌కేఎన్ లాంటి నిర్మాత‌ల పేర్లు ప‌డుతుంటాయి. ఇక ఇప్పుడు గీత‌గోవిందం లాంటి సంచ‌ల‌న సినిమాను నిర్మించిన త‌ర్వాత బ‌న్నీ వాస్ ఆఫీస్ పై ఐటి దాడులు జ‌రిగాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు కానీ జ‌రిగిన‌ట్లు మాత్రం తెలుస్తుంది.

Related image

పెద్ద ఎత్తున గీతా ఆర్ట్స్ కార్యాల‌యంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వ‌హించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఏమిటా అనేది కూడా పెద్ద ఎత్తున చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌ధానకార‌ణం గీత‌గోవిందం సినిమా అని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ గీత గోవిందం సినిమాను తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు పరుశురాం తెరకెక్కించారు. ఈ మూవీ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా వసూళ్లు సాధించింది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంతో 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా మారిపోయాడు.

Image result for allu arvind

అయితే ఈ మూవీ ఈ నేపథ్యంలో గీతగోవిందం సినిమా వసూళ్ల లెక్కలు తేల్చేందుకు ఐటీ అధికారులు జూబ్లీహిల్స్ లోని గీతా ఆర్ట్స్ 2 కార్యాలయంలో త‌నిఖీలు నిర్వహించినట్లు సమాచారం. వసూళ్లకు తగ్గట్లుగా ఆదాయపు పన్ను చెల్లించారా లేదా అనే విషయంలో అధికారులు డాక్యుమెంట్స్ పరిశీలించినట్లు తెలుస్తోంది. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ క్లారిటీ ఇవ్వ‌లేదు, కానీ సోదాలు జ‌రిగిన‌ట్లు మాత్రం తెలుస్తుంది.
అక్క‌డ సినిమాల‌కు సంబంధించిన వివరాలు.. క‌లెక్ష‌న్ల‌ రికార్డులను ఐటి అధికారులు ప‌రిశీలించిన‌ట్లు తెలుస్తుంది.

ఈ క్రింది వీడియో చూడండి 

గీత గోవిందం సినిమా క‌లెక్ష‌న్లు దాదాపు 130 కోట్లు రావ‌డంతో ఐటీ అధికారులు ఈ ప‌న్ను చెల్లింపుల గురించి గుచ్చి గుచ్చి అడిగిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నిజానికి ఇది బ‌న్నీ వాస్ పేరు మీదున్నా కూడా గీతా ఆర్ట్స్ 2 అన్నా కూడా అల్లు అరవింద్ ఆజ్ఞ‌తోనే ఇది కూడా న‌డుస్తుంది. మొత్తానికి ఇప్పుడు అల్లు అర‌వింద్ ఆఫీసుపై ఐటి దాడుల విష‌యం మాత్రం చాలా వేగంగా ఇండ‌స్ట్రీ అంతా పాకిపోయింది. మ‌రో ప‌క్క మెగా అభిమానులు మెగా కాంపౌండ్ మాత్రం ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు లేవు అని, ఐటీ అధికారుల సాధార‌ణ సోదాలు జ‌రిగాయి అని చెబుతున్నారు.