Breaking News:నటుడు విశాల్ అరెస్టు

207

ప్రముఖ నటుడు, నడిగర్ సంగం అధ్యక్షుడు విశాల్‌కు కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. టీడీఎస్‌ను సక్రమంగా చెల్లించని కేసులో విశాల్‌కు ఈ వారెంట్ జారీ అయింది. చెన్నై వడపళనిలో ఉన్న విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ ఆఫీస్‌లో ఐదేళ్లుగా పనిచేస్తున్న సిబ్బందికి ఇచ్చిన జీతాల్లో మినహాయించిన పన్నును సక్రమంగా ఆదాయ పన్ను శాఖకు చెల్లించలేదని, దానికి వివరణ ఇవ్వాలంటూ విశాల్‌కు గతంలో అధికారులు నోటీసులు జారీచేశారు. దానికి సమాధానం ఇవ్వకపోవడంతో విశాల్‌పై చర్యలు చేపట్టాలంటూ ఎగ్మూరు కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. 

ఈ క్రింద వీడియో చూడండి

గతంలో దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు ఆగస్టు 2న విశాల్ విచారణకు హాజరై వివరణ ఇవ్వాలంటూ విశాల్‌ను ఆదేశిస్తూ సమన్లు పంపింది. కానీ శుక్రవారం విశాల్‌ హాజరు కాలేదు. ఐటీ అధికారులు పంపిన నోటీసు విశాల్‌కు అందలేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నేరుగా హాజరుకావడం నుంచి విశాల్‌కు మినహాయింపు కల్పించాలని కోరారు. దీనిని ఐటీ తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వాదనలు విన్న తర్వాత విశాల్‌కు నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ను న్యాయమూర్తి జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు.