Breaking News : ప్రముఖ నటుడు మృతి.. తరలివస్తున్న సినీ ప్రముఖులు

215

సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య వరుస విషాదఛాయలు అలుముకుంటున్నాయి. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలోని ప్రముఖ సినీ ప్రముఖులు చనిపోతున్నారు. చాలా మంది సిని ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. ఇప్పుడు మరొక సినీ ప్రముఖుడి జీవితంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వృద్ధాప్య సంబంధిత వ్యాధి కారణంగా

బెంగాలీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బెంగాలీ నటుడు స్వరూప్ దత్ మృతి చెందారు. అయన వయసు 78 ఏళ్ళు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం రోజు తెల్లవారు జామున ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. నటుడు స్వరూప్ దత్ కొన్ని నెలలుగా వృద్ధాప్య సంబంధిత వ్యాధి కారణంగా తీవ్ర అనారోగ్యం పాలయ్యారని తెలుస్తోంది. గత శనివారం ఆయన ఆపస్మారక స్థితికి వెళ్లిపోవడంతో ఆసుపత్రిలో జాయిన్ చేశారు ఆయన కుటుంబ సభ్యులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే బుధవారం ఉదయం స్వరూప్ దత్ తుది శ్వాస విడిచారు. స్వ‌రూప్ ద‌త్తా అంటే మ‌న ద‌గ్గ‌ర తెలియ‌క‌పోవ‌చ్చు కానీ బెంగాలి సినిమాలో మాత్రం ఆయ‌న అద్భుత‌మైన న‌టుడు. స్వరూప్ దత్ ఎన్నో బెంగాలీ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు. 1960 దశకంలో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు. తపన్ సిన్హా దర్శకత్వంలో వచ్చిన ‘అపంజన్‌’ అనే సినిమా ఆయన కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో బెంగాలీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు స్వరూప్ దత్.

బెంగాలీ గొప్ప నటుల్లో ఒకడిగా

ఉత్పల్‌ దత్‌ను స్ఫూర్తిగా పొంది నాటకాల్లో నటించిన స్వరూప్ దత్.. ఆ తర్వాత చాలా కాలంపాటు రంగస్థల నటుడిగా కొనసాగారు. ‘సగిన మహటో’, ‘హర్మోనియం’, ‘పితా పుత్ర అండ్‌ మా ఓ మేయే’ వంటివి ఈయన చేసిన ప్రముఖ చిత్రాలు. బెంగాల్‌ భాషలో గొప్ప నటుల్లో ఒకడిగా కీర్తి గడించారు స్వరూప్ దత్. స్వరూప్ దత్ కి భార్య, ఒక కొడుకు అన్నారు. అతని కొడుకు షరన్‌ దత్‌ కూడా నటుడే. విభిన్నమైన పాత్రలు పోషించి బెంగాలీ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గురువారం సాయంత్రం ఆయన అంతిమయాత్ర జరగనుందని సమాచారం. కాగా స్వరూప్ దత్ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు తమ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు సినీ ప్రముఖులు. అయన ఇంటికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. మరికొందరు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.